News March 29, 2024
డీప్‌ఫేక్‌పై ప్రధాని ఏమన్నారంటే?

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌తో ‘చాయ్ పే చర్చ’లో డీప్‌ఫేక్‌పై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ లాంటి దేశంలో డీప్‌ఫేక్‌ను ఎవరైనా ఉపయోగించవచ్చని.. కొందరు తన గొంతును అనుకరించారని చెప్పారు. ఇది తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడితే వక్రమార్గంలో వెళ్తుందన్నారు. AIతో తన హిందీ ప్రసంగాన్ని తమిళంలోకి అనువదించినట్లు గుర్తు చేశారు. ఏఐ శక్తిమంతమే అయినా.. దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందన్నారు.
Similar News
News January 21, 2026
కుప్పంలో ఎయిర్పోర్ట్.. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు.?

తమిళనాడు హోసూర్‌లో అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ నిర్మించాలని DMK ప్రభుత్వం నిర్ణయించింది. భద్రతా కారణాలతో దీనికి కేంద్రం అభ్యంతరం తెలిపింది. అయితే దీని వెనకాల రాజకీయ కోణం ఉందని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోందట. కుప్పంలో CM చంద్రబాబు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. కుప్పం-హోసూర్ మధ్య 80 KM దూరమే ఉండటంతో చంద్రబాబే హోసూర్ ఎయిర్‌పోర్ట్‌ను అడ్డుకున్నారని TN ప్రభుత్వం అనుకుంటుందట.
News January 21, 2026
కేంద్రప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటే ACB కేసు పెట్టొచ్చు: SC

కేంద్రప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటే CBI ముందస్తు అనుమతి లేకుండానే రాష్ట్ర పోలీసులు కేసు పెట్టవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అవినీతి నిరోధక చట్టంలోని Sec-17 ప్రకారం రాష్ట్ర ఏజెన్సీ, కేంద్ర ఏజెన్సీతో పాటు ఏ ఇతర పోలీసు ఏజెన్సీ అయినా కేసు పెట్టొచ్చంది. అవినీతికి పాల్పడ్డ కేంద్రప్రభుత్వ ఉద్యోగిపై రాజస్థాన్ ACB కేసుపెట్టడాన్ని అక్కడి హైకోర్టు సమర్థించగా సుప్రీంకోర్టు సైతం ఏకీభవించింది.
News January 21, 2026
నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా, జైలు శిక్ష

నిబంధనలను ఉల్లంఘించి పురుగు మందులను తయారు చేసినా, దిగుమతి చేసుకున్నా నేరం. వీటి విక్రయాల వల్ల ఎవరైనా మరణించినా లేదా గాయపడినా తయారీదారులను బాధ్యులను చేస్తూ ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. తొలిసారి నేరానికి రూ.10లక్షలు- రూ.50 లక్షలు, రెండోసారి అదే తప్పు చేస్తే, గతంలో విధించిన జరిమానా కంటే రెట్టింపు వసూలు చేస్తారు. రిపీటైతే లైసెన్స్ రద్దు, ఆస్తులను జప్తు చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది.


