News December 10, 2024

మోహన్‌బాబు రాసిన లేఖలో ఇంకేముందంటే?

image

TG: తాను HYD జల్‌పల్లిలో పదేళ్లుగా ఉంటున్నానని, ఇల్లువదిలి వెళ్లిపోయిన <<14835430>>మనోజ్<<>> 4నెలల కిందట తిరిగొచ్చారని రాచకొండ CPకి రాసిన లేఖలో మోహన్‌బాబు చెప్పారు. ‘అతను తన భార్య, మరికొందరితో కలిసి నన్ను ఇంటి నుంచి పంపాలని చూశాడు. తన 7నెలల కుమార్తెను ఇంటి పనిమనిషి సంరక్షణలో విడిచిపెట్టాడు. మాదాపూర్‌లోని నా ఆఫీసు సిబ్బందిని 30మందితో బెదిరించాడు. నేను 78ఏళ్ల సీనియర్ సిటిజన్‌ని. రక్షణ కల్పించండి’ అని రాశారు.

Similar News

News January 21, 2026

ప్రతి ఏడాది ఫాలో అప్ సదస్సు పెట్టండి.. CM ప్రతిపాదన

image

TG: ప్రతి జులైలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో అప్ సదస్సు నిర్వహించాలని CM రేవంత్ దావోస్‌లో ప్రతిపాదించారు. ఈ రోజుల్లో పెట్టుబడుల ఒప్పందాలు, వ్యాపార వాణిజ్య నిర్ణయాలకు ఒక సంవత్సరం చాలా ఎక్కువ సమయమని.. అందుకే ప్రతి ఏడాది జులై/AUGలో ఫాలో-అప్ ఫోరం నిర్వహించాలని WEF​ ప్రతినిధులకు సూచించారు. ఇటీవల తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ రూ.5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించిందని సీఎం గుర్తు చేశారు.

News January 21, 2026

సెంట్రల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీస్ అసిస్టెంట్, వాచ్‌మెన్, సబ్ స్టాఫ్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ(BSW/BA/BCOM),టెన్త్, 7వ తరగతి అర్హత కలిగినవారు అర్హులు. వయసు 22 -40 ఏళ్ల మధ్య కలిగి ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://centralbank.bank.in/

News January 21, 2026

శబరిమల ఆలయం ఎప్పుడు తెరుస్తారంటే?

image

శబరిమలలో 2నెలలు కొనసాగిన మండల-మకరవిలక్కు ముగియడంతో ఆలయాన్ని అధికారులు మూసేశారు. మళ్లీ ఫిబ్రవరిలో జరగబోయే నెలవారీ పూజల కోసం ఆలయాన్ని తిరిగి తెరవనున్నారు. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం ఆలయాన్ని FEB 12 సా.5 గంటలకు తెరుస్తారు. పూజలు 17వ తేదీ రా.10గం.కు వరకు కొనసాగుతాయి. అప్పుడూ భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. గతంలో మాదిరే ఆన్‌లైన్ బుకింగ్, దర్శన టోకెన్లు కొనసాగుతాయి.