News July 18, 2024
వరంగల్ డిక్లరేషన్లో ఇంకా ఏం ఉంది?

TG: వరంగల్ డిక్లరేషన్లో ప్రకటించిన రైతు రుణమాఫీని CM రేవంత్ అమల్లోకి తెచ్చారు. దీంతో పాటు రైతు భరోసా కింద ఎకరాకు ₹15వేలు, కూలీలకు ₹12వేలు, చక్కెర కర్మాగారం రీఓపెన్, పసుపుబోర్డు ఏర్పాటు, పంట నష్టపరిహారం, రైతులు/రైతు కూలీలకు బీమా, వ్యవసాయానికి ఉపాధి పథకం, రైతులకు పోడు, అసైన్డ్ భూముల యాజమాన్య హక్కులు, ధరణి రద్దు, అసంపూర్ణ ప్రాజెక్టుల పూర్తి, రైతు కమిషన్ ఏర్పాటు, నూతన వ్యవసాయ విధానం ఉన్నాయి.
Similar News
News December 10, 2025
రంప: డిప్యూటీ డైరెక్టర్కు షోకాజ్ నోటీసు?

రంపచోడవరం గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాంగదయ్యకు ITDA పీవో స్మరణ్ రాజ్ షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. గోకవరం పోస్ట్ మెట్రిక్ బాలుర వసతి గృహం వార్డెన్గా పని చేస్తున్న సంబుడును పీఓ అనుమతి లేకుండా రంపచోడవరం సహాయ గిరిజన సంక్షేమాధికారిగా నియమించినందుకుగాను నోటీసు జారీ చేసినట్లు సమాచారం. ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి ITDA POకు ఫిర్యాదు చేయడంతో నోటీసు అందజేశారని తెలిసింది.
News December 10, 2025
బొప్పాయిలో తెగుళ్ల నివారణకు సూచనలు

నాణ్యమైన ధ్రువీకరించిన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. విత్తన శుద్ధి తప్పక చేసుకోవాలి. నర్సరీల నుంచి మొక్కలను తీసుకుంటే వైరస్ తెగుళ్ల లక్షణాలు లేకుండా చూసుకోవాలి. ఏదైనా మొక్కలో వైరస్ తెగులు లక్షణాలు కనిపిస్తే దాన్ని పంట నుంచి తీసేసి దూరంగా కాల్చివేయాలి. తోటలో ఎక్కువగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. బొప్పాయి నారు మొక్కలను పొలంలో నాటే 3 రోజుల ముందే లీటరు నీటికి 1.5గ్రా. అసిఫేట్ కలిపి పిచికారీ చేయాలి.
News December 10, 2025
తిరుమల క్షేత్రపాలకుడు ఎవరో కాదు…!

7 కొండలపై కోట్లాది భక్తులకు అభయమిస్తున్న శ్రీవారి ఆలయానికి క్షేత్రపాలకుడు త్రిమూర్తుల్లో ఒకరైన శివుడి మరో రూపమైన రుద్రుడు. ఈ క్షేత్రపాలక శిల తిరుమల గోగర్భం వద్ద, పాపవినాశనం వెళ్లే మార్గంలో ఉంది. శివకేశవులకు భేదం లేదని ఇది నిరూపిస్తోంది. ప్రతి మహా శివరాత్రి రోజున TTD వారు ఇక్కడ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. తిరుమలలో విష్ణువుతో పాటు రుద్రుడికి కూడా ప్రాధాన్యత ఉందనడానికి ఇదే నిదర్శనం. <<-se>>#VINAROBHAGYAMU<<>>


