News October 15, 2024

2019లో మహారాష్ట్రలో ఏం జరిగింది? (1/2)

image

2019 Octలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో BJP- అప్ప‌టి ఉద్ధ‌వ్ నేతృత్వంలోని శివ‌సేన కూట‌మి 161 స్థానాలు గెలుచుకుంది. BJP105, శివ‌సేన 56 సీట్లు ద‌క్కించుకున్నాయి. అయితే, ఫ‌లితాల త‌రువాత త‌మ‌కూ CM ప‌ద‌వి ఇవ్వాల‌ని శివ‌సేన మెలిక పెట్టింది. దీనికి BJP అంగీక‌రించ‌లేదు. దీంతో కాంగ్రెస్ (44), ఎన్సీపీ (54)ల మ‌ద్ద‌తుతో ఉద్ధ‌వ్ ఠాక్రే CM అయ్యారు. త‌ద్వారా మ‌హారాష్ట్రలో మ‌హావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్ప‌డింది.

Similar News

News November 13, 2025

ముంబైలోకి విధ్వంసకర బ్యాటర్

image

IPL: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ రూథర్‌ఫర్డ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు ముంబై ఇండియన్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. రూ.2.6 కోట్లకు గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుంది. ఇతడికి 200 టీ20 మ్యాచులు ఆడిన అనుభవం ఉంది. 3500కు పైగా రన్స్ చేశారు. భారీ సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించగల సత్తా రూథర్‌ఫర్డ్ సొంతం.

News November 13, 2025

అల్ ఫలాహ్ వర్సిటీకి షాక్

image

ఉగ్ర మూలాలు బయటపడిన ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ వర్సిటీపై అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్(AIU) చర్యలు తీసుకుంది. సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వెంటనే లోగోను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కళాశాలకు గుర్తింపు ఉందంటూ వెబ్‌సైట్‌లో ప్రదర్శించినందుకు వర్సిటీకి న్యాక్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. యూనివర్సిటీకి ఫండింగ్, డాక్టర్ల ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేయనుంది.

News November 13, 2025

ప్రేమ అర్థాన్ని కోల్పోయింది: అజయ్ దేవగణ్

image

ప్రేమ అర్థాన్ని కోల్పోయిందని బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ అన్నారు. ‘ప్రేమ అనే పదాన్ని అనవసరంగా ఉపయోగిస్తున్నారు. దాని డెప్త్‌ను అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రతి మెసేజ్‌కు హార్ట్ ఎమోజీ పెడుతున్నారు. అన్ని మెసేజ్‌లు లవ్‌తో ముగుస్తున్నాయి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్, రెన్యువల్ ఉండాలని అజయ్ భార్య <<18269284>>కాజోల్<<>> చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఇలా చెప్పడం గమనార్హం.