News December 27, 2024

2024లో ఒక్క నిమిషంలో ఏం జరిగిందంటే?

image

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌లో సగటున ప్రతి నిమిషంలో ఏం జరిగిందో తెలిపే డేటా వైరలవుతోంది. ఒక్క నిమిషంలో గూగుల్‌లో 5.9M సెర్చులు, 10.41 లక్షల ప్రశ్నలకు సిరి జవాబివ్వడం, యూట్యూబ్‌లో 34.72 లక్షల వ్యూస్, 18.8 మిలియన్ల టెక్స్ట్ మెసేజ్‌లు, ఇన్‌స్టా& ఫేస్‌బుక్‌లో 138.9M వ్యూస్, 251.1 మిలియన్ల మెయిల్స్, 9వేల మంది లింక్డ్‌ఇన్‌లో జాబ్ అప్లికేషన్లు నమోదైనట్లు డేటా తెలిపింది.

Similar News

News December 8, 2025

గూడెంకొత్తవీధి: రద్దు చేసిన రాత్రి బస్సుల పునరుద్ధరణ

image

మావోయిస్టుల PLGA వారోత్సవాల నేపద్యంలో ఈ నెల 2 నుంచి విశాఖ నుంచి గూడెంకొత్తవీధి మండలం సీలేరు- పీలేరు మీదుగా భద్రాచలం బస్సులు రద్దు చేసిన సంగతి తెలిసిందే. వారోత్సవాలు నేటితో ముగుస్తుండడంతో మంగళవారం నుంచి యధావిధిగా గూడెం కొత్త వీధి మీదుగా భద్రాచలం, సీలేరు వెళ్లే నైట్ బస్సులను పునరుద్ధరణ చేస్తున్నట్లు విశాఖ DM మాధురి తెలిపారు.

News December 8, 2025

మీ ఫ్రిజ్ ఎక్కువకాలం పనిచేయాలంటే?

image

* ఫ్రిజ్ కంపార్ట్‌మెంట్ టెంపరేచర్‌ను 4°C, ఫ్రీజర్‌ను -18°C వద్ద మెయింటేన్ చేయండి.
* వేడి కంటైనర్లను నేరుగా లోపల పెట్టవద్దు.
* సరిగ్గా డోర్ వేయండి. పదేపదే డోర్ తెరవొద్దు.
* ఫ్రిజ్ కాయిల్స్‌, లోపలి భాగాలను తరచూ క్లీన్ చేయండి.
* ఫ్రిజ్‌ను పూర్తిగా నింపేయకుండా ఖాళీ స్థలాన్ని ఉంచండి.
* ఫ్రిజ్ చుట్టూ కనీసం 10CM స్థలాన్ని వదలండి.
* ఒవెన్స్, డిష్ వాషర్స్, డైరెక్ట్ సన్‌లైట్‌కు దూరంగా ఫ్రిజ్‌ను ఉంచండి.

News December 8, 2025

ఇంటర్వ్యూతో BELలో పోస్టులు

image

HYD-నాచారంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌(<>BEL<<>>) గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. BE, B,Tech, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు DEC 9న ఉ. 9.30గం.- 11.30గం. వరకు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. ముందుగా https://nats.education.gov.in/ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫారమ్ ప్రింట్ ఇంటర్వ్యూకు తీసుకువెళ్లాలి. వెబ్‌సైట్: https://bel-india.in/