News July 23, 2024
జూన్ 3న స్టాక్ మార్కెట్లో ఏం జరిగిందంటే!

ఎగ్జిట్‌పోల్ ఊపులో జూన్ 3న నిఫ్టీ 3.25% పెరిగింది. కౌంటింగ్ రోజైన 4న మాత్రం 5.93% పతనమైంది. దీంతో మార్కెట్లో ఏం జరిగిందో సెబీ పార్లమెంటుకు నివేదిక ఇచ్చింది. 3న NSEలో టాప్ 100 సెల్లర్స్ రూ.87915 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మేశారని తెలిపింది. MFలు రూ.15572 కోట్లు, PFI రూ.10658 కోట్లు, రిటైల్ రూ.4544 కోట్లు, బీమా రూ.2566 కోట్లు, PMS రూ.362 కోట్లు, ఇతర సంస్థలు రూ.54,211 కోట్ల మేర అమ్మకాలు చేపట్టాయి.
Similar News
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 2, 2025
ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్‌సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్‌తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.


