News March 16, 2025
పొట్టి శ్రీరాములు చనిపోయిన రోజు ఏం జరిగిందంటే.. (2/2)

తమ ఆత్మగౌరవం కోసం ఆ మహానుభావుడు చిత్రవధ అనుభవించి చనిపోతే తెలుగువారెవరూ స్పందించలేదు. అంత్యక్రియలకే దిక్కులేదు. గాయకుడు ఘంటసాల ఎద్దులబండిపై శవయాత్ర ప్రారంభించారు. ఈలోగా చేరుకున్న ప్రకాశం పంతులు బండెక్కి తెలుగువారి చేతకానితనంపై బూతులు లంకించుకున్నారు. క్షణాల్లో నగరమంతా వార్త పాకింది. లక్షల్లో జనం జతయ్యారు. మద్రాసు తగలబడింది. పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ప్రకటన వెలువడింది.
Similar News
News March 16, 2025
అర్ధరాత్రి మహిళా ఎంపీ ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడు

TG: బీజేపీ ఎంపీ డీకే అరుణ జూబ్లీహిల్స్‌లోని ఇంట్లో అర్ధరాత్రి ఆగంతకుడు కలకలం రేపాడు. ముసుగు, గ్లౌజులు ధరించి ఇంట్లోకి చొరబడిన దుండగుడు కిచెన్, హాలు సీసీ కెమెరాలు ఆఫ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. దుండగుడు వచ్చిన సమయంలో MP ఇంట్లో లేకపోవడం గమనార్హం. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు డీకే అరుణ ఫిర్యాదు చేశారు. ఇందులో కుట్రకోణం దాగి ఉందని, భద్రత పెంచాలని ఆమె డిమాండ్ చేశారు.
News March 16, 2025
రూమ్‌లో ఒంటరిగా చింతిస్తూ కూర్చోవాలా?: కోహ్లీ

ఆటగాళ్లు పర్యటనలో ఉన్నప్పుడు వెంట కుటుంబాలను తీసుకెళ్లకూడదని BCCI విధించిన తాజా నిబంధనపై విరాట్ కోహ్లీ స్పందించారు. ‘మ్యాచుల్లో ఎంతో తీవ్రతతో ఆడుతుంటాం. మ్యాచ్ పూర్తికాగానే కుటుంబం చెంతకు చేరడం ఎంతో రిలీఫ్ ఇస్తుంటుంది. అది ఆటగాళ్లకు చాలా అవసరం. అంతేకానీ మ్యాచ్ ముగిశాక రూమ్‌లో ఒంటరిగా చింతిస్తూ కూర్చోవాలా? కుటుంబాలు మాతో ఉండటం ఎంత అవసరమో కొంతమందికి తెలియట్లేదు’ అని పేర్కొన్నారు.
News March 16, 2025
రాజధానికి రూ.11వేల కోట్ల రుణం.. కీలక ఒప్పందం

AP: CM చంద్రబాబు సమక్షంలో హడ్కో- CRDA మధ్య ఒప్పందం జరిగింది. ఈ మేరకు రాజధాని అమరావతి నిర్మాణాలకు హడ్కో రూ.11వేల కోట్ల రుణం ఇవ్వనుంది. జనవరి 22న జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల మంజూరుకు అంగీకరించగా, నేడు ఆ మేరకు ఒప్పందం జరిగింది. కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో CMD సంజయ్ కుల్ శ్రేష్ఠ పాల్గొన్నారు. వచ్చే నెల ప్రధాని చేేతుల మీదుగా రాజధాని పనులు పున: ప్రారంభం కానున్నాయి.