News May 4, 2024

రోహిత్‌శర్మకు ఏమైంది?

image

T20WC ముంగిట టీమ్ ఇండియా అభిమానుల్లో కలవరం మొదలైంది. రోహిత్‌శర్మ నిన్న కోల్‌కతాతో మ్యాచ్‌లో ఫీల్డింగ్‌కు రాలేదు. ముంబై జట్టు అతడిని ఇంపాక్ట్ ప్లేయర్‌‌గా బ్యాటింగ్‌కు దించింది. రోహిత్ వెన్నెముక సమస్యతో ఇబ్బంది పడుతున్నారట. ఇదే విషయాన్ని మేనేజ్మెంట్‌తో చెప్పడంతో అతడికి ముందు జాగ్రత్తగా వర్క్ లోడ్ తగ్గించిందట. కెప్టెన్ సమస్య తీవ్రం కాకూడదని అభిమానులు కోరుకుంటున్నారు.

Similar News

News December 29, 2024

అమ్మో.. ధరలు బాబోయ్ ధరలు!

image

TG: ఆదాయంలో మార్పు లేదు కానీ ఖర్చులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. పప్పు నుంచి ఉప్పు వరకు, కూరగాయల నుంచి మాంసం వరకు అన్నీ భారమే. రాష్ట్రంలో కుటుంబాలకు నెలవారీ ఖర్చులు తలకు మించిన భారంగా ఉంటోందని జాతీయ గృహ వినియోగ సర్వే తెలిపింది. ప్రతి నెలా నిత్యావసరాల నిమిత్తం రాష్ట్రంలోని కుటుంబాలకు రూ.5675 ఖర్చవుతోందని పేర్కొంది. నెలవారీ వ్యయంలో కేరళ, తమిళనాడు తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది.

News December 29, 2024

నేడు ప్రో కబడ్డీ లీగ్ ఫైనల్

image

ప్రో కబడ్డీ లీగ్-2024 ఫైనల్ నేడు జరగనుంది. హరియాణా స్టీలర్స్, పట్నా పైరెట్స్ తుది సమరంలో తలపడనున్నాయి. రా.8 గంటలకు మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో నం.1గా ఉన్న హరియాణా తొలి సారి ట్రోఫీని ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు మూడుసార్లు విజేతగా నిలిచిన పట్నా నాలుగో టైటిల్‌పై కన్నేసింది.

News December 29, 2024

వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌గా తెలుగు తేజం

image

వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ టైటిల్ విజేతగా తెలుగు తేజం కోనేరు హంపి నిలిచారు. టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లారు. ఇండోనేషియా ప్లేయర్ ఇరెనె సుఖందర్‌పై ఆమె విజయం సాధించారు. 2019లోనూ ఆమె విజేతగా నిలిచారు. దీంతో చైనా గ్రాండ్ మాస్టర్ జు వెంజన్ తర్వాత ఎక్కువ సార్లు టైటిల్ గెలుచుకున్న ప్లేయర్‌గా హంపి రికార్డులకెక్కారు. మెన్స్ విభాగంలో రష్యా ప్లేయర్ మర్జిన్ టైటిల్ గెలిచారు.