News July 14, 2024
శంకర్ మ్యాజిక్ ఏమైంది.. ఆయన లేకపోవడమే కారణమా!

వైవిధ్యభరితమైన కథ, కథనం, కళ్లుచెదిరే సెట్లు ఇవన్నీ డైరెక్టర్ శంకర్ మూవీల్లోని ప్రత్యేకతలు. 90వ దశకంలో వరుస హిట్లతో సంచలనం సృష్టించారు. కానీ ఇప్పుడా మ్యాజిక్ పని చేయట్లేదు. దీనిక్కారణం శంకర్ ఆస్థాన రైటర్ సుజాత రంగరాజన్ లేకపోవడమే అంటున్నాయి సినీ వర్గాలు. రోబో తర్వాత సుజాత మరణించారు. ఆ తర్వాత ఆయన తీసిన స్నేహితుడు, ఐ, రోబో2, భారతీయుడు2 నిరాశపర్చాయి. మరి గేమ్ఛేంజర్తోనైనా శంకర్ హిట్ కొడతారేమో చూడాలి.
Similar News
News January 3, 2026
పంటల్లో చెదపురుగుల ఉద్ధృతి తగ్గాలంటే..

పంటల్లో చెదపురుగుల ఉద్ధృతి తగ్గాలంటే వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. గట్లపై కలుపు లేకుండా చూడాలి. బాగి చివికిన పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. పంట మార్పిడి విధానం అనుసరించాలి. పసుపును అంతర పంటగా వేసుకోవాలి. పంట వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి, తల్లి చెదపురుగును గుర్తించి నాశనం చేయాలి. చెద ఆశించిన మొక్కల మొదళ్లలో లీటర్ నీటికి క్లోరిపైరిఫాస్ 50% EC 2ml కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు.
News January 3, 2026
తిరుమల: సాఫీగా దర్శనం.. భక్తుల హర్షం

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి సాధారణ భక్తులకు టోకెన్లు లేకుండానే సర్వదర్శనం క్యూలైన్ నుంచి వైకుంఠ ద్వారం గుండా దర్శనానికి TTD అనుమతిస్తోంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. ఏర్పాట్లు బాగున్నాయని, సాఫీగా దర్శనం చేసుకున్నామని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా SSD టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 20 గంటలు పడుతోంది.
News January 3, 2026
సిక్ లీవ్ అడిగితే లైవ్ లొకేషన్ షేర్ చేయమన్న మేనేజర్

తీవ్రమైన తలనొప్పితో సిక్ లీవ్ అడిగిన ఒక ఉద్యోగికి తన మేనేజర్ నుంచి వింత అనుభవం ఎదురైంది. లీవ్ కావాలంటే వాట్సాప్లో ‘లైవ్ లొకేషన్’ షేర్ చేయాలని మేనేజర్ పట్టుబట్టారు. దీంతో షాకైన సదరు ఉద్యోగి ఈ విషయాన్ని Reddit వేదికగా వాట్సాప్ స్క్రీన్షాట్లతో సహా పంచుకున్నారు. ఇది వ్యక్తిగత ప్రైవసీని ఉల్లంఘించడమేనంటూ నెటిజన్లు మేనేజర్ తీరును, అక్కడి వర్క్కల్చర్ను తప్పుబడుతున్నారు.


