News April 4, 2025

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఏమైంది..!

image

ఐపీఎల్ 2025లో తన తొలి మ్యాచులో భారీ విజయం సాధించిన SRH ఆ తర్వాత గాడి తప్పింది. ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఘోర పరాజయం పాలైంది. LSGపై 5 వికెట్లు, DCపై 7 వికెట్లు, KKRపై 80 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఇలాగే ఆడితే ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జట్టులోని ఆటగాళ్లు సమష్ఠిగా రాణించి విజయాలు నమోదు చేయాలని కోరుకుంటున్నారు.

Similar News

News April 4, 2025

గతేడాది అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే..

image

గత ఆర్థిక సంవత్సరం ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన వెహికిల్‌గా మారుతీ సుజుకీ వేగన్-R నిలిచింది. 1,98,451 యూనిట్లు విక్రయించినట్లు సంస్థ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు మెుత్తం 33.7 లక్షల యూనిట్లు సేల్ చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆటో మెుబైల్ మార్కెట్‌లో Wagon-R 4th జెనరేషన్ వెహికిల్ 9 వేరియంట్లలో అందుబాటులో ఉంది.

News April 4, 2025

పాపం.. అలోవెరా జ్యూస్ అనుకొని తాగి..

image

అలోవేరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగి 14 ఏళ్ల బాలిక మరణించింది. బెంగళూరుకు చెందిన దీపాంజలికి అలోవెరా జ్యూస్ తాగే అలవాటు ఉంది. ఎప్పటిలాగే ఇంట్లో ఉన్న బాటిల్‌ తీసుకొని తాగేసింది. అయితే అంతకుముందే అందులో జ్యూస్ అయిపోవడంతో పేరెంట్స్ ఆ డబ్బాలో పురుగుల మందు లిక్విడ్ పోసి పెట్టారు. అది గమనించకపోవడంతో దీపాంజలి తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.

News April 4, 2025

రజినీకాంత్ కూలీ రిలీజ్ డేట్ ఫిక్స్!

image

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘కూలీ’ మూవీని ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ‘కూలీ ఫ్రమ్ ఆగస్టు 14’ అన్న హాష్ ట్యాగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో శృతిహాసన్, పూజా హెగ్డే తదితరులు నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

error: Content is protected !!