News November 8, 2024
BRS ఇంటింటి సర్వే రిపోర్ట్ ఏమైంది?

2014 AUG 19న అప్పటి BRS ప్రభుత్వం సమగ్ర సర్వే నిర్వహించింది. అయితే ఆ రిపోర్టు ఎక్కడ ఉందనేది ఎవరికీ తెలియదు. కాగా దాన్ని గోప్యంగా ఉంచాలని కోర్టు ఆదేశించడంతో బయటపెట్టలేదని BRS చెబుతోంది. దాని ఆధారంగా అనేక పథకాలు ప్రవేశపెట్టి, అమలు చేశామంటోంది. అటు గతంలో ఆ సర్వే గురించి మాట్లాడిన కాంగ్రెస్ ఇప్పుడు దాన్ని ప్రస్తావించకుండా కొత్త సర్వే చేస్తోంది. కాగా ఈ సర్వే కూడా అలాంటిదేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Similar News
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్‌లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు

<
News December 13, 2025
ఈ వాతావరణం కనకాంబరం సాగుకు అనుకూలం

అధిక తేమ, వేడి కలిగిన ప్రాంతాలు కనకాంబరం సాగుకు అనుకూలం. మొక్క పెరుగుదలకు 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండాలి. చల్లని వాతావరణ పరిస్థితుల్లో పూల దిగుబడి అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటే పూలు లేత రంగుకు మారి నాణ్యత తగ్గుతుంది. మరీ తక్కువ ఉష్ణోగ్రతను కూడా మొక్క తట్టుకోలేదు. నీరు నిలవని అన్ని రకాల నేలలు, ఉదజని సూచిక 6 నుంచి 7.5 మధ్య ఉన్న నేలల్లో మంచి దిగుబడి వస్తుంది.


