News January 25, 2025

బీఆర్ఎస్ నేతలపై పెట్టిన కేసులు ఏమయ్యాయి?: బండి సంజయ్

image

TG: ఫార్ములా-ఈ రేసు కేసులో KTRను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ సహా BRS నేతలపై పెట్టిన కేసులన్నీ ఏమయ్యాయని అన్నారు. కరీంనగర్ మేయర్ సునీల్ రావు సహా పలువురు కార్పొరేటర్లు బీజేపీలో చేరిన సందర్భంగా సంజయ్ మాట్లాడారు. దావోస్ పెట్టుబడులపై శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా అని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

Similar News

News December 31, 2025

ఎంత తాగితే డ్రంకన్ డ్రైవ్‌లో దొరకరు?

image

మందుబాబులు తలబాదుకునే ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. ఒక బీరే కదా.. ఒక పెగ్గుకు ఏం కాదులే అనుకుంటే పొరపాటే. విస్కీ, బ్రాందీ, బీర్, వైన్ ఇలా.. ఏ రకమైనా గ్లాసు తాగినా టెస్టులో పాజిటివ్ (35పాయింట్స్) వస్తుంది. మందుతో పాటు మనుషుల శరీరాన్ని బట్టి, రక్తంలో ఆల్కహాల్ కలిసే సమయం ఆధారంగా ఈ రిజల్ట్ మారుతుంది. కాబట్టి మద్యం తాగడం, తాగకపోవడం మీ ఇష్టం. కానీ ఒక్క చుక్క బాడీలోకి వెళ్లినా బండి తీయకండి.

News December 31, 2025

2025: భారత వనితల జైత్రయాత్ర!

image

ఈ ఏడాది భారత మహిళలు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటారు. రచయిత్రి బానూ ముస్తాక్ బుకర్ ప్రైజ్ సాధించగా, రచయిత్రి పాయల్ కపాడియా కేన్స్‌లో మెరిశారు. సామాజిక సేవలో వర్ష దేశ్‌పాండే(UN అవార్డు), పర్యావరణంలో డా.సొనాలి ఘోష్, జయశ్రీ వెంకటేశన్ అవార్డులు అందుకున్నారు. మహిళల అంధుల జట్టు T20 WC, ఉమెన్స్ టీమ్ ODI WC నెగ్గింది. ఇంజినీర్ మాధవిలత ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ వంతెన నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.

News December 31, 2025

యూరియాపై అనవసర ఆందోళనలు: మంత్రి

image

TG: అన్ని జిల్లాల్లో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నా అనవసర <<18720117>>ఆందోళనలు<<>> సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రస్తుతం సుమారు 2L మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని, సొసైటీ/రిటైల్ షాప్‌కు వచ్చే ప్రతి రైతుకూ బస్తాలు అందుతున్నాయని చెప్పారు. యూరియా యాప్ అమలవుతున్న జిల్లాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేవని, యాప్ ద్వారా దాదాపు లక్ష మంది 3.19L బస్తాలు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.