News September 26, 2024

రెండు చీరలు ఇస్తానన్న సీఎం ఏమైపోయావ్?: KTR

image

TG: ‘ఆడబిడ్డలకు 2 బతుకమ్మ చీరలు ఇస్తానన్న సీఎం ఏమైపోయావ్?’ అని KTR ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేసిందనే ఓ పత్రికా కథనంపై స్పందించారు. ‘అత్తమీద కోపం దుత్త మీద తీర్చినట్లు ఉంది మీ వ్యవహారం. మా మీద కోపం ఆడబిడ్డల మీద చూపిస్తున్నారు. వారికి ఇంకా గొప్పగా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఇచ్చేది కూడా ఆపేస్తే ఎలా?’ అని Xలో పేర్కొన్నారు.

Similar News

News November 14, 2025

నేడు ఈ అమ్మవారిని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు

image

లక్ష్మీదేవి విగ్రహాల్లో వ్యూహలక్ష్మి ప్రతిమను దర్శించుకుంటే భక్తులకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ దివ్య రూపం తిరుమల శ్రీవారి వక్షస్థలంలో కొలువై ఉంటుంది. స్వామివారి సమస్త జగత్తును పాలించే పరాశక్తి స్వరూపాన్ని హృదయంలో ధ్యానించడం వలన అఖండమైన ఐశ్వర్యంతో పాటు, ధైర్యం, జ్ఞానం వంటి అష్టైశ్వర్యాలు సిద్ధించి, సమస్త దోషాలు తొలగిపోతాయట. ఈ రూపంలో అమ్మను ‘త్రిభుజా’ అని పిలుస్తారు.

News November 14, 2025

కొనుగోలు కేంద్రాల్లో వరికి మంచి ధర రావాలంటే..

image

వరి కోత, నూర్పిడి సమయంలో ధాన్యంలో తేమశాతం 23 నుంచి 26 శాతం వరకు ఉంటుంది. అప్పుడు ధాన్యాన్ని టార్పలిన్ లేదా ప్లాస్టిక్ పట్టాలపై పలుచగా ఆరబెడితే గింజ రంగు మారకుండా నల్లగా కాకుండా మంచి నాణ్యతగా ఉంటుంది. కొనుగోలు కేంద్రాల్లో మంచి ధర రావాలంటే ధాన్యంలో బెరుకు గింజలు 6%, తేమశాతం 17%, పుచ్చిపోయిన గింజలు 5%, ఇతర వ్యర్థ పదార్థాలు 1%, పక్వానికి రాని గింజలు 3% గరిష్ఠ స్థాయి మించకుండా ఉండేలా చూసుకోవాలి.

News November 14, 2025

న్యూ స్పేస్ ఇండియాలో 47 పోస్టులు

image

<>న్యూస్పేస్<<>> ఇండియా లిమిటెడ్ 47పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, B.Tech, BE, డిప్లొమా, ME, M.Tech, M.Phil, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు రూ.250. SC, ST, PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://www.nsilindia.co.in/