News October 24, 2024
హిట్‌మ్యాన్‌కు ఏమైంది? మళ్లీ ఫెయిల్

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో వరుసగా విఫలమవుతున్నారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ ఆయన డకౌటయ్యారు. ఈ సిరీస్‌లో ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ హిట్‌మ్యాన్ క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగారు. గత 4 టెస్టుల రన్స్ అన్నీ కలిపి కూడా 100లోపే ఉండటం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆడుతున్న ఈ సిరీస్‌లో రాణించాలని వారు కోరుతున్నారు.
Similar News
News March 17, 2025
పోలవరం ఎత్తును తగ్గించింది జగనే: నిమ్మల

AP: పోలవరం ప్రాజెక్టు కోసం 2014 నుంచి ఇప్పటివరకు రూ.19,396 కోట్లు ఖర్చు చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో తెలిపారు. ఇందులో కేంద్రం రూ.17,860 కోట్లు చెల్లించిందన్నారు. తొలి దశ R&Rను 2026 జూన్ లోపు పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం ఎత్తును జగన్ హయాంలోనే రెండుగా విభజించారని, 41.15 మీటర్ల ఎత్తు ప్రతిపాదన పెట్టింది ఆయనేనని విమర్శించారు. పోలవరం ఎత్తును ఎందుకు తగ్గించారో జగన్‌నే అడగాలన్నారు.
News March 17, 2025
పాక్‌కు మరో జలాంతర్గామిని ఇచ్చిన చైనా

తమ మిత్రదేశం పాకిస్థాన్‌కు చైనా మరో జలాంతర్గామిని అందించింది. 5 బిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా మొత్తం 8 హ్యాంగర్ క్లాస్ సబ్‌మెరైన్లను ఇస్లామాబాద్‌కు బీజింగ్ ఇవ్వాల్సి ఉండగా గతంలో ఒకటి ఇచ్చేసింది. ఈ రెండూ కాక అత్యాధునిక ఫ్రిగేట్ నౌకలు నాలుగింటిని కూడా సమకూర్చింది. అరేబియా సముద్రంలో భారత్‌ను అడ్డుకునేందుకు పాక్‌ను వాడుకోవాలనేది చైనా వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే పాక్ నేవీని బలోపేతం చేస్తోంది.
News March 17, 2025
మాతా వైష్ణోదేవీ కాంప్లెక్స్ వద్ద మద్యం తాగిన నటుడు

బాలీవుడ్ స్టార్ కిడ్స్ క్లోజ్ ఫ్రెండ్, ఇన్‌ఫ్లుయెన్సర్ ఒర్హాన్ అవత్రమణిపై JK పోలీసులు కేసు నమోదు చేశారు. మాతా వైష్ణోదేవీ యాత్రలో ఆయన మద్యం సేవించారు. నిషేధం ఉన్నా రష్యన్ సిటిజన్ అనస్టాలియా సహా మరో ఏడుగురితో కలిసి కాట్రాలోని హోటల్లో మద్యం తాగినట్టు రియాసీ పోలీసులు గుర్తించారు. BNSS 223 కింద FIR నమోదు చేశారు. Call Me Bae, MyFitness – Orry x Khali వంటి సిరీసులు, Nadaaniyan సినిమాలో ఆయన నటించారు.