News June 12, 2024
రన్ మెషీన్‌కు ఏమైంది!

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రేమికులను నిరాశపరుస్తున్నారు. ఐపీఎల్లో పరుగుల వరద పారించిన అతడు పొట్టి ప్రపంచకప్‌లో ఆకట్టుకోలేకపోతున్నారు. అమెరికా గడ్డపై పరుగులు చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న కోహ్లీ గత రెండు మ్యాచుల్లో పేలవ ప్రదర్శనతో 1, 4 స్కోర్లతో వెనుదిరిగారు. తాజాగా USAతో మ్యాచ్‌లోనూ డకౌట్ అయ్యారు. కోహ్లీ ఫామ్‌పై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 14, 2025
పెట్టుబడుల సాధనే లక్ష్యంగా నేటి నుంచి సీఐఐ సదస్సు

AP: రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా వైజాగ్‌లో CII భాగస్వామ్య సదస్సు ఇవాళ, రేపు జరగనుంది. దీని కోసం ఆంధ్ర యూనివర్సిటీలో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ CM చంద్రబాబు పలు దేశాల్లో పర్యటించారు. ‘ఇన్వెస్ట్ ఇన్ AP’ సందేశంతో, ‘పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్ – ఇండియాస్ రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్-2047’ థీమ్‌తో ఈ సదస్సును నిర్వహిస్తోంది.
News November 14, 2025
‘జూబ్లీహిల్స్’ ఎవరి సొంతమో?

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజేతగా ఎవరు నిలుస్తారో అని రాష్ట్రమంతా ఆసక్తి నెలకొంది. BRS ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో అనివార్యమైన ఈ ఉపఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 58 మంది బరిలో ఉన్నా బీఆర్ఎస్(మాగంటి సునీత), కాంగ్రెస్(నవీన్ యాదవ్), బీజేపీ(దీపక్ రెడ్డి) మధ్య పోరు నెలకొంది. తమ అభ్యర్థులే గెలుస్తారని ఆయా పార్టీలు ధీమాగా ఉండగా ఫలితం మధ్యాహ్నం కల్లా వెలువడే అవకాశముంది.
News November 14, 2025
బిహార్ ఫలితాలను ప్రభావితం చేసేవి ఇవే!

ఇవాళ బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఫలితాలపై దేశమంతా ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ NDAకే అనుకూలంగా ఉన్నా కింది అంశాలు ఫలితాలను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.
* ప్రాంతాల వారీగా పార్టీల ఆధిపత్యం
* కొత్త పార్టీల పోటీతో ఓట్లు చీలే అవకాశం
* స్థానికత, కుల సమీకరణాలు
* ఓటింగ్ పెరగడం.. పురుషులతో పోలిస్తే మహిళ ఓటర్లే అధికం
* అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన హామీలు


