News November 16, 2024

‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ రిలీజ్ ఎప్పుడంటే?

image

విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ మూవీకి సీక్వెల్ రానున్నట్లు ఇటీవల హీరో విశ్వక్ ఓ హింట్ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘ENE-2’ 2026లో రిలీజ్ అవుతుందని ఆయన చెప్పినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ సినిమాలో అదే టీమ్ కొనసాగుతుందా లేదా కొత్త టీమ్‌ను తీసుకుంటారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Similar News

News December 6, 2025

NTR: SSC నామినల్ రోల్స్ ఎడిట్ ఆప్షన్

image

యూడైస్‌ ప్లస్‌ పోర్టల్‌లో SSC నామినల్ రోల్‌ విద్యార్థుల పరీక్ష వివరాల సవరణ కోసం ఎడిట్ ఆప్షన్ డిసెంబర్ 6న అందుబాటులోకి వచ్చిందని ఉప విద్యాశాఖ అధికారి శ్యాంసుందర్‌రావు తెలిపారు. సబ్జెక్టులు, సీడబ్ల్యూఎస్‌ఎన్ స్థితి, ఫోటోలు, సంతకం వంటి లోపాలను సరిచేయాలని ఆయన సూచించారు. యూడైస్‌ ప్లస్‌లో చేసిన మార్పులు 24 గంటల్లో బీఎస్‌ఈ పోర్టల్‌లో ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయని స్పష్టం చేశారు.

News December 6, 2025

MBBS ప్రవేశాల్లో బాలికలదే పైచేయి: మంత్రి

image

AP: ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి GOVT, PVT వైద్య కళాశాలల్లో MBBS ప్రవేశాలు ముగిశాయి. ఇందులో 60.72% అడ్మిషన్లు అమ్మాయిలే పొందినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గత రెండేళ్లతో పోల్చితే వీరి ప్రవేశాలు 3.66% పెరిగాయన్నారు. 2023-24లో 57.06%, 2024-25లో 57.96%, 2025-26లో 60.72% మంది అమ్మాయిలు సీట్లు పొందారని చెప్పారు. స్కూల్ దశ నుంచే ప్రణాళికతో చదువుతూ ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు.

News December 6, 2025

లైఫ్ సపోర్ట్‌పై ‘ఇండీ కూటమి’: ఒమర్

image

బిహార్ CM నితీశ్ NDAలోకి వెళ్లడానికి ఇండీ కూటమే కారణమని J&K CM ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. రెండేళ్ల కిందట కూటమి కన్వీనర్‌గా తన అభ్యర్థిత్వాన్ని కొందరు అడ్డుకున్నారని చెప్పారు. HT లీడర్‌షిప్ సమ్మిట్‌లో మాట్లాడుతూ ‘బిహార్ మహాగట్‌బంధన్‌లో JMM చేరలేదు. రేపు జాతీయస్థాయిలోనూ అది కూటమిని వీడితే తప్పెవరిది? ప్రస్తుతం మా కూటమి లైఫ్ సపోర్ట్‌పై ఉంది. కొందరైతే దాని కథ ముగిసిందంటున్నారు’ అని పేర్కొన్నారు.