News December 1, 2024

బల్లి పడిన ఆహారం తింటే ఏమవుతుంది?

image

శరీరంపై బల్లి పడితే అపశకునమని, ఆహారంలో అది పడితే విషపూరితం అవుతుందని కొందరు అనుకుంటారు. కానీ బల్లుల్లో మనుషులను చంపేంత విషం ఉండదని ఇప్పటికే పరిశోధనల్లో తేలింది. ఒక్కోసారి బల్లి పడిన ఆహారం తీసుకుంటే వాంతులు, తలనొప్పి కలగొచ్చు. కానీ ఇవి అలర్జీల వల్లే వస్తాయి. ఇళ్లలో ఉండే బల్లులు కరిచినా మనుషులకు ఏం కాదు. ఒక వేళ బల్లి కుడితే భయాందోళనలకు గురికాకుండా ఫస్ట్ ఎయిడ్ తీసుకుని, ఆ తర్వాత ఆస్పత్రికి వెళ్లాలి.

Similar News

News March 13, 2025

PPM: ‘మార్చి 23 నాటికి గృహ నిర్మాణాల సర్వే పూర్తి చేయాలి’

image

అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాల సర్వేను మార్చి 23 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. వివిధ శాఖల ప్రగతిని కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. స్టేజ్ అప్ గ్రేడ్ విధిగా జరగాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇనుము ధర తగ్గిందని, ఇసుక లభ్యంగా ఉందన్నారు. ఉపాధి హామీ కింద వేతనాలు పెరిగాయని అన్నారు.

News March 13, 2025

IPL: హ్యారీ బ్రూక్‌పై రెండేళ్ల నిషేధం

image

ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయన ఐపీఎల్‌లో రెండేళ్లు ఆడకుండా నిషేధం విధించింది. దీంతో బ్రూక్ ఐపీఎల్ ఆడే అవకాశం లేదు. 2028 ఐపీఎల్‌లో మాత్రమే ఆడే ఛాన్స్ ఉంది. కాగా ఇటీవల ఐపీఎల్ 2025 నుంచి తప్పుకుంటున్నట్లు బ్రూక్ ప్రకటించారు. దీంతో ఐపీఎల్ రూల్ ప్రకారం సరైన కారణం లేకుండా టోర్నీ నుంచి తప్పుకుంటే రెండేళ్ల నిషేధం విధిస్తారు.

News March 13, 2025

దస్తగిరికి భద్రత పెంపు

image

AP: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరికి ప్రభుత్వం భద్రత పెంచింది. గతంలో ఆయనకు 1+1 సెక్యూరిటీ ఉండగా ఇకపై 2+2కు గన్‌మెన్లను కేటాయించినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. వివేకా హత్య కేసులో సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందుతున్న నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని ఆయన ఇటీవల విన్నవించారు. దీంతో సెక్యూరిటీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

error: Content is protected !!