News November 9, 2024

డాలర్‌ వాల్యూ పెరిగితే ఏం అవుతుంది?

image

డాలర్ విలువ పెరిగితే రూపాయి విలువ తగ్గుతుంది. దేశాల మధ్య లావాదేవీలు దాదాపు డాలర్లలోనే జరుగుతుంటాయి. అందుకే వస్తువుల ఎగుమతి/దిగుమతుల కోసం భారత్ సహా చాలా దేశాలు డాలర్లను నిల్వ చేసుకుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్లకు డిమాండ్ పెరిగితే మనం ఎక్కువ రూపాయలు చెల్లించి వాటిని కొనుక్కోవాల్సి వస్తుంది. మన ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువగా ఉంటే రూపాయి పడిపోతుంది. డాలర్ నిల్వలు ఖర్చవుతాయి.

Similar News

News December 9, 2025

నువ్వుల విత్తనాలను వెదజల్లేకంటే విత్తడం మేలట

image

నువ్వుల పంట కోసం విత్తనాలను సాధారణంగా రైతులు వెదజల్లుతారు. అయితే విత్తనాన్ని వెదజల్లడం కంటే విత్తడం మేలంటున్నారు నిపుణులు. విత్తనాలను వరుసల మధ్య 30సెం.మీ, మొక్కల మధ్య 15సెం.మీ దూరం ఉండేటట్లు విత్తుకోవాలంటున్నారు నిపుణులు. విత్తనాలను వరుసలలో విత్తితే కలుపు తీసుకోవడానికి అనువుగా ఉండటమే కాకుండా మొక్కకు నీరు, పోషకాలు, సూర్యరశ్మి సమానంగా అంది కొమ్మలు బాగా వృద్ధి చెంది అధిక దిగుబడులు సాధించవచ్చు.

News December 9, 2025

మహాలక్ష్మి పథకంతో మహిళలకు రూ.8,459 కోట్లు ఆదా: పొన్నం

image

TG: మహాలక్ష్మి పథకం ద్వారా RTCలో మహిళలకు ఉచిత ప్రయాణాలు మొదలై రెండేళ్లు పూర్తయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. రెండేళ్లలో మహిళలు 251 కోట్ల జీరో టికెట్ల ద్వారా రూ.8,459 కోట్లు ఆదా చేసినట్లు వెల్లడించారు. బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాకుండా మహిళలను బస్సులకు యజమానులుగా చేసిన ప్రభుత్వంగా నిలిచిందని పేర్కొన్నారు.

News December 9, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.330 తగ్గి రూ.1,30,090కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.300 పతనమై రూ.1,19,250 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1,99,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.