News February 2, 2025

16 మంది ఎంపీలున్న చంద్రబాబు ఏం సాధించారు?: బుగ్గన

image

కేంద్ర బడ్జెట్‌లో APకి నిధులు రాబట్టడంతో CM చంద్రబాబు విఫలమయ్యారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. 12 మంది MPలతోనే బిహార్ CM నితీశ్ అధిక నిధులు సాధించారని, 16 మంది MPలున్నప్పటికీ CBN అసమర్థుడిగా మిగిలారని మండిపడ్డారు. ‘పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితం చేశారు. నిర్మాణంలో ఉన్న పోర్టులకు నిధులు కోరలేదు. మెడికల్ కాలేజీల విషయంలోనూ నిర్లక్ష్యం వహించారు’ అని దుయ్యబట్టారు.

Similar News

News November 20, 2025

HYD: చలిమంట వేసుకునే క్రమంలో ప్రమాదం

image

కొంపల్లిలోని పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధి గుండ్లపోచంపల్లిలో చలిమంట వేసుకునే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. పెయింటర్లు నూర్ ఆలం(36), అశ్రఫ్ అలీ (27) ఇంటికి వెళ్లే సమయంలో చలిమంట వేసుకోగా వారి వద్ద మిగిలిన టర్పెంట్ ఆయిల్‌ని మంటలో వేశారు. దీంతో ఒక్కసారిగా మండి ఇద్దరికీ మంటలు అంటుకున్నాయి. మెరుగైన చికిత్స నిమిత్తం వారిని గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. వీరిద్దరూ బిహార్‌కు చెందిన వారు.

News November 20, 2025

శబరిమల: చిన్నారుల ట్రాకింగ్‌కు ‘Vi బ్యాండ్’

image

శబరిమలలో చిన్నారులు తప్పిపోకుండా వొడాఫోన్-ఐడియా(Vi)తో కలిసి కేరళ పోలీసులు ‘సురక్ష బ్యాండ్’లను తీసుకొచ్చారు. చిన్న పిల్లలతో శబరిమల వెళ్లే భక్తులు Vi సెక్యూరిటీ కియోస్కుల వద్ద, కేరళలోని అన్ని Vi స్టోర్లలో ఈ సురక్ష బ్యాండ్‌లను పొందొచ్చు. ఆన్‌లైన్‌లో కూడా వీటికోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రతి బ్యాండ్‌కు ఒక స్పెషల్ డిజిటల్ కోడ్ ఉంటుంది. ఒకవేళ పిల్లలు తప్పిపోతే వారిని దీని సాయంతో ట్రాక్ చేయొచ్చు.

News November 19, 2025

రాష్ట్రపతి ప్రశ్నలు.. రేపు అభిప్రాయం చెప్పనున్న SC

image

బిల్లుల ఆమోదం, సమయపాలన అంశాలకు <<17597268>>సంబంధించి <<>>రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము లేవనెత్తిన 14 ప్రశ్నలపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం రేపు అభిప్రాయాన్ని వెల్లడించనుంది. తమిళనాడు సర్కారు వేసిన పిటిషన్ విచారణలో బిల్లుల ఆమోదానికి గవర్నర్‌, రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీం తీర్పునిచ్చింది. దీనిపై న్యాయసలహా కోరుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టుకు ముర్ము 14 ప్రశ్నలు వేశారు.