News February 1, 2025
ఇద్దరు కేంద్రమంత్రులు, 8మంది MPలు ఏం సాధించారు?: హరీశ్ రావు

బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచెయ్యి చూపారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సమ్మిళిత వృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. ‘రాజకీయ అవసరాల కోసమే బడ్జెట్ ఉపయోగించుకున్నారు. ఇలాంటి వైఖరితో వికసిత్ భారత్ సాధ్యమా? ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు వరాలు ప్రకటించారు. ఇది కేవలం 3 రాష్ట్రాల బడ్జెట్‌లా ఉంది. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8మంది ఎంపీలు ఉండి ఏం సాధించారు’ అని ప్రశ్నించారు.
Similar News
News December 1, 2025
మాయదారి మహమ్మారికి ఆరేళ్లు..!

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ‘కరోనా’ మహమ్మారిని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. చైనా వుహాన్‌లో తొలి కరోనా కేసు నమోదై నేటికి ఆరేళ్లు. 2019లో మొదలైన ఈ మహమ్మారి అతి తక్కువ కాలంలోనే ప్రపంచాన్ని చుట్టుముట్టింది. 70లక్షల మంది ప్రాణాలను హరించి, కోట్లాది మందిని రోడ్డున పడేసింది. భారీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న మానవాళి.. టీకాలు, ఆరోగ్య నియమాలతో పోరాడి గెలిచింది. కరోనా మీ జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చింది?
News December 1, 2025
రేపు హైకోర్టుకు పరకామణి కేసు నివేదిక

AP: టీటీడీ పరకామణి కేసు విచారణ నేటితో పూర్తి కానుంది. రేపు సీఐడీ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. హైకోర్టు ఆదేశాలతో అక్టోబర్ 27 నుంచి సీఐడీ.. టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి సహా 35 మందిని విచారించింది. విచారణకు హాజరవుతూ అప్పటి AVSO సతీశ్ అనుమానాస్పదంగా మరణించారు. చెన్నై, బెంగళూరు, విశాఖలో నిందితుడు రవికుమార్ ఆస్తులను పరిశీలించింది.
News December 1, 2025
‘దిత్వా’ తుఫాన్.. ఈ జిల్లాలకు వర్ష సూచన

AP: నైరుతి బంగాళాఖాతంలో ‘దిత్వా’ తుఫాన్ ఈ మధ్యాహ్నంలోపు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


