News October 20, 2025

ఇన్ఫోసిస్ ఏపీకి వెళ్లిపోతే?.. కర్ణాటక ప్రభుత్వంపై కుమారస్వామి ఫైర్

image

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కుమారస్వామి ఫైరయ్యారు. పారిశ్రామికవేత్తలతో అనుచితంగా ప్రవర్తించడం సరికాదని విమర్శించారు. ‘ఇన్ఫోసిస్ <<18031642>>నారాయణమూర్తి<<>>, సుధామూర్తి దంపతులను అవమానించేలా సీఎం సిద్దరామయ్య మాట్లాడటం దారుణం. ఒకవేళ ఇన్ఫోసిస్ తన కార్యకలాపాలను ఏపీకి మారిస్తే పరిస్థితి ఏంటి? ‘మీ అవసరం మాకు లేదు’ అన్నట్లు వ్యవహరించడం రాష్ట్రానికే నష్టం’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News October 20, 2025

మేం మొదలుపెడితే తట్టుకోలేరు.. కేతిరెడ్డిపై జేసీ ఫైర్

image

AP: ధర్మవరం మాజీ MLA కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ‘ఇదే మీకు లాస్ట్ దీపావళి అని కేతిరెడ్డి అంటున్నారు. అలా అంటే చూస్తూ ఊరుకోవాలా? మేం మొదలుపెడితే మీరెవరూ తట్టుకోలేరు’ అని ఫైరయ్యారు. ఆయన ఆలోచించి మాట్లాడాలని, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేరని అన్నారు.

News October 20, 2025

కూతురిపై అత్యాచారానికి యత్నించాడని కొట్టిచంపిన తండ్రి!

image

తన కూతురిపై అత్యాచారానికి యత్నించిన కామాంధుడిని రాయితో కొట్టి చంపాడో తండ్రి. ఒడిశాలోని థెన్‌కనల్ జిల్లాలో జరిగిందీ ఘటన. కాలువలో స్నానం చేసేందుకు తండ్రితో కలిసి బాలిక (10) వెళ్లింది. స్నానం ముగించుకున్నాక పక్కకు వెళ్లిన సమయంలో కరుణాకర్ (27) అనే వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక ఏడుపు విన్న తండ్రి వచ్చి బండరాయితో కొట్టి చంపాడు. తర్వాత స్థానిక పర్జంగ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

News October 20, 2025

రోహిత్, విరాట్ ఫామ్‌పై స్పందించిన గవాస్కర్

image

ఆస్ట్రేలియాతో రెండో ODIలో రోహిత్, విరాట్ తిరిగి పుంజుకుంటారని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆశాభావం వ్యక్తంచేశారు. వారిద్దరూ భారీ స్కోర్లు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అన్నారు. ‘రోహిత్, కోహ్లీ 2 నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడట్లేదు. AUSలో బౌన్సీ పిచ్‌పై అంత ఈజీ కాదు. వారు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత త్వరగా లయను అందుకుంటారు. టీమ్ ఇండియా 300+ రన్స్ చేస్తుంది’ అని ఓ ఇంటర్వ్యూలో అన్నారు.