News March 2, 2025
‘తల్లికి వందనం’ ప్రభుత్వ స్కూళ్లకే పరిమితం చేస్తే?

AP: తల్లికి వందనం <<15620703>>పథకం <<>>ప్రైవేట్ స్కూళ్లలో చదివే వారికి వర్తింపజేయడంపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. డబ్బు చెల్లించే స్తోమత ఉన్న వారే ప్రైవేట్ స్కూళ్లల్లో పిల్లలను చదివిస్తారని, వారికి పథకం ఎందుకుని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆ డబ్బుతో ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసి, మెరుగైన టీచర్లను నియమిస్తే అడ్మిషన్లు పెరుగుతాయంటున్నారు. పథకం అందరికీ వర్తింపజేయాలని కొందరు కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News October 19, 2025
APPLY NOW: CWCలో ఉద్యోగాలు

సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్(CWC) 22 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cwceportal.com/
News October 19, 2025
మామిడిలో ఇనుపధాతు లోపం – నివారణ

మామిడిలో ఇనుపధాతులోప సమస్య ఉన్న చెట్ల ఆకులు పచ్చదనం కోల్పోయి తెల్లగా పాలిపోతాయి. ఆకుల సైజు తగ్గిపోతుంది. సమస్య తీవ్రత పెరిగితే మొక్కల ఆకులు పైనుంచి కిందకు ఎండిపోతాయి. ఇనుపధాతు లోపం సున్నపురాయి ఉన్న నేలల్లో సాధారణంగా కనిపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి 2.5 గ్రా అన్నబేధి+1 గ్రా. నిమ్మఉప్పు లేదా ఒక బద్ద నిమ్మకాయ రసం కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు చెట్టుపై పిచికారీ చేయాలి.
News October 19, 2025
తొలి మహిళా సీఎం సుచేతా కృపలాని

స్వాతంత్ర్య సమరయోధురాలు సుచేతా కృపలాని దేశంలోనే తొలి మహిళా CMగా బాధ్యతలు చేపట్టి చరిత్రలో నిలిచారు. 1908లో పంజాబ్‌లోని జన్మించిన ఆమె బెనారస్ యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా పనిచేశారు. 1936లో ప్రొఫెసర్ కృపలానీని మ్యారేజ్ చేసుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకెళ్లారు. స్వాతంత్య్రం తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి లోక్‌సభ, శాసనసభలకు ప్రాతినిధ్యం వహించారు. 1963లో UP CMగా ఎన్నికై చరిత్ర సృష్టించారు.