News December 15, 2024
అదే పని ఆసీస్ చేస్తే.?: గవాస్కర్

హెడ్, సిరాజ్ వివాదంలో ఆస్ట్రేలియా ప్రేక్షకుల ప్రవర్తనపై క్రికెట్ దిగ్గజం గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆస్ట్రేలియాలోని ‘శాంతిపరులు’ అందరూ సిరాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిలాగే ఆస్ట్రేలియా ఆటగాళ్లెవరైనా చేసి ఉంటే ఇదే జనం వాళ్లకు జేజేలు కొట్టి ఉండేవారు. ఆస్ట్రేలియన్లు ఒకప్పటిలా వీధికుక్కల్లా రెచ్చిపోవాలని ఆ దేశ మీడియా అంటోంది. మరి ఆ వీధికుక్కలు మొరుగుతాయా?’ అని ప్రశ్నించారు.
Similar News
News November 27, 2025
కోదాడ: హోరా హోరీగా జాతీయ స్థాయి క్రీడలు

కోదాడ సీసీ రెడ్డి పాఠశాలలో 19వ సీఎస్ఏ జాతీయ స్థాయి క్రీడా పోటీలు గురువారం రెండో రోజు ఉత్సాహంగా కొనసాగాయి. ప్రిన్సిపల్ ఆన్ జ్యోతి పర్యవేక్షణలో కన్వీనర్ సిస్టర్ ఉడుముల శౌరీలు, సిస్టర్ నక్షత్రం క్రీడలను ప్రారంభించారు. వాలీబాల్, బాస్కెట్‌బాల్, ఖోఖో, కబడ్డీ, త్రోబాల్, అథ్లెటిక్స్‌లో విద్యార్థులు ప్రతిభ చూపించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులతో పండుగ వాతావరణం నెలకొంది.
News November 27, 2025
తొలిరోజు నామినేషన్లు ఎన్నో తెలుసా?

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తొలిరోజు 3,242 సర్పంచ్, 1,821 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడతలో ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న వాటిని పరిశీలిస్తారు. డిసెంబర్ 3 వరకు విత్‌డ్రాకు అవకాశం ఉంటుంది. తొలి దశలో 4,236 గ్రామాలకు, 37,440 వార్డులకు పోలింగ్ జరగనుంది. కాగా తొలి విడత పోలింగ్ డిసెంబర్ 11న నిర్వహించనున్నారు.