News October 6, 2025

బీసీ రిజర్వేషన్ల జీవోపై సుప్రీం స్టే విధిస్తే?

image

TG: స్థానిక ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో-9పై సుప్రీంలో కాసేపట్లో విచారణ జరగనుంది. ప్రభుత్వం తరఫున లాయర్లు సింఘ్వీ, దవే వాదనలు వినిపించనున్నారు. అటు ఈ జీవో పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 285కు విరుద్ధమని పిటిషనర్‌ గోపాల్‌రెడ్డి వాదిస్తున్నారు. దీంతో జీవోపై SC స్టే విధిస్తే ఎన్నికలకు బ్రేక్ పడుతుందా? లేక సర్కార్ ముందుకే వెళ్తుందా? అనేది ఉత్కంఠగా మారింది.

Similar News

News October 6, 2025

BREAKING: రిజర్వేషన్లపై పిటిషన్ డిస్మిస్

image

TG: బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం 42శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టులో విచారణలో ఉండగా సుప్రీంకు ఎందుకు వచ్చారని పిటిషనర్‌ గోపాల్‌రెడ్డిని ప్రశ్నించింది. అయితే HCలో స్టే ఇవ్వకపోవడంతో ఇక్కడికి వచ్చామని పిటిషనర్ తెలిపారు. దీంతో HCలో పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని SC స్పష్టం చేసింది. కాగా ఎల్లుండి హైకోర్టులో విచారణ జరగనుంది.

News October 6, 2025

బీసీ రిజర్వేషన్ల జీవోపై సుప్రీంలో విచారణ ప్రారంభం

image

TG: స్థానిక ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో-9ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వం తరఫున లాయర్లు సింఘ్వీ, దవే వాదనలు వినిపిస్తున్నారు. విచారణ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి కూడా సుప్రీంకోర్టుకు వెళ్లారు.

News October 6, 2025

ఏపీ అప్డేట్స్

image

* కర్ణాటకలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్.. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ గోపాల గౌడ అమృత మహోత్సవం కార్యక్రమానికి హాజరు
* విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్థులను పరామర్శించిన హోంమంత్రి అనిత.. కురుపాం ఘటనపై నిపుణుల కమిటీతో విచారణ చేపడుతామని వెల్లడి
* ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగింపు.. ఇవాళ్టితో గడువు ముగియడంతో ఏసీబీ కోర్టులో హాజరు