News March 20, 2025
రాత్రి 7 గంటలలోపు ఈ పని చేస్తే?

రాత్రి 7 గంటలలోపు భోజనం చేయకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 7 గంటలకు ముందే డిన్నర్ చేస్తే ఆయుర్దాయం 35 శాతం పెరుగుతుందని చెబుతున్నారు. త్వరగా భోజనం చేస్తే జీర్ణం కావడానికి, శరీరం విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయం దొరుకుతుంది. డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. బరువు తగ్గే అవకాశం ఉంది. గుండె జబ్బులు వచ్చే ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది.
Similar News
News March 21, 2025
అలా చేస్తే టీమ్ ఇండియాలో చోటు: సురేశ్ రైనా

భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. IPLలో 500 పరుగులు చేస్తే ఇండియా టీమ్‌లో చోటు దక్కే అవకాశముందని అన్నారు. యంగ్ ప్లేయర్లు తిలక్ వర్మ, రింకూ సింగ్, జైస్వాల్‌కు తాను పెద్ద అభిమాని అని చెప్పారు. చాలా మంది ప్లేయర్లు తన టాలెంట్‌ను ప్రదర్శించి అంతర్జాతీయ టోర్నీల్లో సత్తా చాటారని పేర్కొన్నారు. మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన రైనా.. టీ20WC, వన్డే WC, CT నెగ్గిన భారత జట్టులో సభ్యుడు.
News March 21, 2025
అమెరికా విద్యాశాఖ మూసేస్తూ ట్రంప్ కీలక నిర్ణయం

అమెరికాలో విద్యాశాఖను మూసేస్తూ ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకోగా తాజాగా విద్యాశాఖపై బాంబ్ పేల్చారు. ఇందులో భాగంగానే ఇటీవల ఆ శాఖలోని ఉద్యోగాల్లో కోతలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా విద్యాశాఖను మూసేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు.
News March 21, 2025
నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

AP: తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకార సేవా టికెట్ల జూన్ నెల కోటాను ఇవాళ ఉదయం 10 గంటలకు TTD ఆన్లైన్లో విడుదల చేయనుంది. అలాగే, జూన్ 9- 11 వరకు జరుగనున్న శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలకు సంబంధించి టికెట్లు ఉ.11 గంటలకు రిలీజ్ అవుతాయి. వీటితో పాటు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూన్ నెల కోటా టోకెన్లు మ.3 గంటలకు విడుదల కానున్నాయి.