News April 4, 2025
సమ్మర్‌లో బ్రేక్ ఫాస్ట్‌గా వీటిని తింటే?

ఎండాకాలంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట ఇడ్లీ సాంబార్ తింటే ఆరోగ్యం సమతుల్యంగా ఉంటుంది. పెసరపప్పుతో చేసిన దోశల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. రాగి జావలో కాల్షియం ఉండటంతో కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. కూరగాయలతో చేసిన ఉప్మా తింటే శరీరానికి బలం చేకూరుతుంది. పెరుగుతో కలిపి అటుకులు తింటే శరీరానికి పోషకాలు లభిస్తాయి.
Similar News
News April 4, 2025
చైనా ప్రతీకార సుంకాలు.. స్పందించిన ట్రంప్

ట్రంప్ తమపై విధించిన సుంకాలకు ప్రతీకారంగా చైనా కూడా 34శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. దానిపై ట్రంప్ స్పందించారు. ‘వారు మాపై సుంకాలు విధించలేరు. అది వారికి మంచిదికాదు. కానీ టెన్షన్ పడ్డారు. తప్పటడుగు వేశారు’ అని తన ట్రూత్ సోషల్‌లో వ్యాఖ్యానించారు. సుంకాలతో పాటు అరుదైన వనరుల ఎగుమతులపై, రక్షణ రంగ సంబంధితమైన 30 అమెరికా కంపెనీలపై చైనా ఆంక్షలు విధించింది.
News April 4, 2025
BIG NEWS: రేపటి మ్యాచ్‌కు CSK కెప్టెన్‌గా ధోనీ?

గత నెల 30న రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో గాయపడిన CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇంకా కోలుకోలేదని సమాచారం. రేపు ఢిల్లీతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ధోనీ మరోసారి నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై యాజమాన్యం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
News April 4, 2025
బర్డ్ ఫ్లూపై ఆందోళన వద్దు: CM చంద్రబాబు

AP: బర్డ్ ఫ్లూపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యాధి నిరోధకశక్తి లేకపోవడం, లెప్టోస్పీరోసిస్ తదితర కారణాల వల్ల ఈ వ్యాధి సోకి ఇటీవల ఓ బాలిక మృతి చెందిందని చెప్పారు. దీనిపై ICMR బృందం అధ్యయనం చేసిందన్నారు. కాగా ఆ బృందంతో సీఎం ఇవాళ సమీక్షించారు.