News August 24, 2024
‘రాఖీకి కూడా భయపడితే ఎలా?: KTR

TG: తనకు రాఖీ కట్టిన మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు జారీ <<13934152>>చేయడంపై<<>> మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. చేతి నిండా రాఖీలతో ఉన్న ఫొటోను Xలో పోస్ట్ చేసిన ఆయన ‘రాఖీకి కూడా భయపడితే ఎలా?’ అని క్యాప్షన్ ఇచ్చారు.
Similar News
News November 13, 2025
భారత్, అఫ్గానిస్థాన్‌తో యుద్ధానికి సిద్ధం: పాకిస్థాన్

భారత్, అఫ్గానిస్థాన్‌తో ప్రత్యక్ష యుద్ధానికి రెడీగా ఉన్నామని పాకిస్థాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ఇస్లామాబాద్‌లో మంగళవారం జరిగిన సూసైడ్ బాంబ్ బ్లాస్ట్‌లో 12 మంది మరణించగా 36 మంది గాయపడ్డారు. దాడి చేసింది తామేనని పాకిస్థానీ తాలిబన్ (TTP) ప్రకటించుకున్న తర్వాత ఆసిఫ్ చేసిన కామెంట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత మద్దతుతోనే దాడి జరిగిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపిస్తున్నారు.
News November 13, 2025
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

AP: అనంతపురం జిల్లాలోని మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖ వన్ స్టాప్ సెంటర్‌లో 4 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 25 వరకు అప్లై చేసుకోవచ్చు. సైకో-సోషల్ కౌన్సెలర్, మల్టీ పర్పస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల వయసు 25 -42ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీ, డిప్లొమా (సైకాలజీ), టెన్త్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
News November 13, 2025
రబీలో జొన్న, సజ్జ పంటలను ఎప్పుడు నాటితే మంచిది?

☛ రబీ జొన్న పంటను నవంబర్ రెండోవారం చివరి వరకు విత్తుకోవచ్చు. కిలో విత్తనానికి 3 గ్రా. థయోమిథాక్సామ్ కలిపి విత్తనశుద్ధి చేసుకుంటే మొవ్వుతొలిచే ఈగ నుంచి జొన్న పంటను రక్షించుకోవచ్చు.
☛ సజ్జ పంటను నవంబర్ చివరి వరకు విత్తుకోవచ్చు. ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి 6గ్రా. మెటలాక్సిల్ 35 W.S మందును కలిపి విత్తనశుద్ధి చేస్తే తెగుళ్ల ఉద్ధృతి తగ్గుతుంది.


