News March 8, 2025
ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినకపోతే?

ఆరోగ్యకరమైన జీవనానికి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. కానీ అల్పాహారాన్ని స్కిప్ చేయడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఉదయాన్నే టిఫిన్ తినకపోతే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. జీవక్రియ మందగించి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. తలనొప్పి, వికారం, వాంతులు రావచ్చు. ఊబకాయం, అల్సర్, గ్యాస్ సమస్యలకూ దారితీస్తుంది. నిద్ర లేచిన రెండు గంటల్లోగా అల్పాహారం తీసుకోవడం బెటర్.
Similar News
News November 24, 2025
పెవిలియన్కు క్యూ కట్టిన భారత ప్లేయర్లు

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో భారత ప్లేయర్ల ఆటతీరు మారడం లేదు. నిలకడ లేమితో వికెట్లు పారేసుకుంటున్నారు. తాజాగా 2వ టెస్టు తొలి ఇన్నింగ్స్లో IND 122 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. జైస్వాల్ ఒక్కడే 58 రన్స్తో కాస్త రాణించారు. రాహుల్(22), సుదర్శన్(15), నితీశ్(10), పంత్(7), జడేజా(6), జురెల్(0) పెవిలియన్కు క్యూ కట్టారు. తొలి టెస్టులో బ్యాటర్లు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్కోర్ 136/7.
News November 24, 2025
BMC బ్యాంక్లో ఉద్యోగాలు

బాంబే మర్కంటైల్ కోఆపరేటివ్(BMC) బ్యాంక్ లిమిటెడ్.. బ్యాంక్ మేనేజర్, క్రెడిట్ ఆఫీసర్, ఏరియా హెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు జనవరి 1, 2026వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 30 -50ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్సైట్: https://bmcbankltd.com/
News November 24, 2025
భారతీయ వైద్యం వైపు అమెరికన్ల మొగ్గు!

అమెరికాతో పోల్చితే ఇండియాలో వైద్య సదుపాయం చాలా బెటర్ అని వైద్యులు చెబుతున్నారు. ఈక్రమంలో పెరుగుతున్న ఖర్చులు, వెయిటింగ్ కారణంగా అమెరికా వంటి పాశ్చాత్య దేశాల రోగులు భారతీయ వైద్యం వైపు మళ్లుతున్నట్లు పేర్కొన్నారు. ‘భారత్లో అత్యల్ప ఖర్చు, తక్షణ అపాయింట్మెంట్లు (సూపర్ స్పెషలిస్ట్లతో సహా), MRI/CT స్కాన్ల వంటి త్వరిత డయాగ్నస్టిక్ సేవల వల్ల రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయి’ అని తెలిపారు.


