News August 25, 2025
ఈ సమయాల్లో నీరు తాగితే?

శరీరానికి అత్యవసరమైన వాటిలో నీరు ఒకటి. రోజుకు 3-4 లీటర్ల నీళ్లు తాగితే ఎన్నో రోగాలను ముందుగానే నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
✒ నిద్ర లేవగానే గోరు వెచ్చని నీరు తాగితే టాక్సిన్స్(వ్యర్థాలు)ను బయటకు పంపుతుంది. ✒ భోజనానికి ముందు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ✒ స్నానానికి ముందు నీరు తాగితే బీపీ నియంత్రణలో ఉంటుంది. ✒ నిద్రకు ముందు తాగితే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ నుంచి రక్షణ కలుగుతుంది.
Similar News
News August 25, 2025
వరుస పండుగలు.. 22 స్పెషల్ ట్రైన్స్

దసరా, దీపావళి, ఛట్ పండగలకు 22 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. SEP 4-25 వరకు సికింద్రాబాద్, తిరుపతి మధ్య 4, కాచిగూడ-నాగర్ సోల్ మధ్య 4 సర్వీసులు, 5-26 వరకు తిరుపతి-సికింద్రాబాద్ 4, నాగర్ సోల్-కాచిగూడ 4 సర్వీసులు నడుస్తాయన్నారు. SEP 19-OCT 3 వరకు సంత్రాగ్జి-చర్లపల్లి మధ్య 3, SEP 20-OCT 4 వరకు చర్లపల్లి-సంత్రాగ్జి మధ్య 3 సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు.
News August 25, 2025
ఉమెన్ ‘జస్టిస్’లో తెలంగాణ టాప్

సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసెర్చ్ ప్రకారం మహిళా న్యాయమూర్తుల సంఖ్యలో TG HC దేశంలోనే టాప్ ప్లేస్‌లో నిలిచింది. 30 మంది జడ్జిలు ఉండగా వారిలో 10 మంది(33.3%) మహిళలే. ఆ తర్వాతి స్థానంలో సిక్కిం HCలో ముగ్గురు జడ్జిల్లో ఒక మహిళా న్యాయమూర్తి ఉన్నారు. ఈ జాబితాలో AP HC 9వ ప్లేస్‌లో ఉంది. 30 మంది జడ్జిల్లో ఐదుగురు మహిళలున్నారు. ఇక SCలో 33 మంది న్యాయమూర్తుల్లో ఇద్దరు మాత్రమే ఉమెన్ జడ్జిలు ఉండటం గమనార్హం.
News August 25, 2025
అదనంగా సర్వీస్ ఛార్జీ ఎందుకు చెల్లించాలి: HC

హోటళ్లు, రెస్టారెంట్లలో వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.20 వాటర్ బాటిల్‌కు రూ.100 తీసుకుంటున్నప్పుడు మళ్లీ విడిగా సర్వీస్ ఛార్జీ ఎందుకు చెల్లించాలని ప్రశ్నించింది. ఛార్జీ తప్పనిసరి కాదంటూ గతంలో హైకోర్టు ఏకసభ్య ధర్మానసం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ భారత హోటళ్లు, రెస్టారెంట్ల సంఘాలు పిటిషన్ వేశాయి. తాజాగా ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.