News August 19, 2024
బ్లూ మూన్, బ్లూ సూపర్ మూన్ అంటే ఏంటి?

ఒకే నెలలో 2సార్లు పౌర్ణమి వస్తే 2వది బ్లూ మూన్. సీజన్లో 4 పౌర్ణమిలు వస్తే 3వ పౌర్ణమినీ బ్లూమూన్ అంటారు. కొన్ని దేశాల్లో స్ప్రింగ్, సమ్మర్, ఫాల్, వింటర్ అని 4 సీజన్లుంటాయి. ఒకే సీజన్లో వస్తున్న నాలుగు పౌర్ణమిలలో 3వది. అటు భూమికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు చంద్రుడిని సూపర్ మూన్ అంటారు. ఈరోజు రెండూ కలిసి ఒకేసారి ఏర్పడుతుండటంతో దీన్ని బ్లూ సూపర్ మూన్ అంటారు. అయితే ఇది బ్లూ కలర్లో ఉండదు.
Similar News
News November 25, 2025
జనవరి నుంచి కొత్త డిస్కం.. నేడు నిర్ణయం

తెలంగాణలో జనవరి 2026లో కొత్త విద్యుత్ డిస్కం ఏర్పాటుపై ఈ మధ్యాహ్నం క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనుంది. దీంతో ఇప్పటికే రూ.59,671 కోట్ల నష్టాల్లోని TGSPDCL, TGNPDCLలపై సబ్సిడీ సరఫరా భారం తగ్గనుంది. వ్యవసాయానికి ఫ్రీ కరెంట్, పేదలకు 200 యూనిట్లు ఫ్రీ, మిషన్ భగీరథ & HYD వాటర్ బోర్డు కొత్త డిస్కంలో ఉంటాయి. దీంతో పాటు మరిన్ని విద్యుత్ సంస్కరణలు నేటి భేటీలో చర్చకు వస్తాయని సమాచారం.
News November 25, 2025
భారత్కు తొలి మహిళా వరల్డ్ స్నూకర్ టైటిల్

చెన్నైకి చెందిన 23 ఏళ్ల అనుపమ రామచంద్రన్ ప్రపంచ స్నూకర్ ఛాంపియన్గా అవతరించారు. చెన్నైలోని విద్యా మందిర్ స్కూల్లో చదివిన అనుపమ, ప్రస్తుతం ఎంఓపీ వైష్ణవ్ కాలేజీలో పబ్లిక్ పాలసీలో పీజీ చేస్తున్నారు. జూనియర్ స్థాయిలో 8 జాతీయ టైటిళ్లు, అమీ కమానీతో కలిసి 2023లో ఉమెన్స్ స్నూకర్ వరల్డ్ కప్, అండర్-21 ప్రపంచ టైటిల్ను కూడా కైవసం చేసుకున్నారు. మహిళల విభాగంలో భారత్కు ఇదే మొట్టమొదటి ప్రపంచ స్నూకర్ టైటిల్.
News November 25, 2025
పంజాబ్ & సింధ్ బ్యాంక్లో 30పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

<<-1>>పంజాబ్ <<>>& సింధ్ బ్యాంక్లో 30 MSME రిలేషన్షిప్ మేనేజర్స్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, ఎంబీఏ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 33ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PWBDలకు రూ.100. వెబ్సైట్: https://punjabandsind.bank.in


