News September 20, 2025
ఉల్లి పంటలో బోల్డింగ్ అంటే ఏమిటి?

ఉల్లి మొక్కల్లో శాఖీయ పెరుగుదల పూర్తికాక ముందే పుష్పించడాన్ని బోల్డింగ్ అంటారు. జన్యుపరమైన లోపాలు, ఉష్ణోగ్రతల్లో అసమానతలు, నాణ్యతలేని విత్తనాల వినియోగం, నాటిన తొలిదశలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు దీనికి కారణం. ఈ సమస్య నివారణకు నాణ్యమైన విత్తనాలు వినియోగించాలి. పొటాషియం ఎరువులను ఎకరానికి 30 కిలోలు వేసుకోవాలి. నీటి ఎద్దడి లేకుండా చూడాలి. 10 లీటర్ల నీటికి 2.5ml మాలిక్ హైడ్రోజైడ్ కలిపి పిచికారీ చేయాలి.
Similar News
News September 20, 2025
‘చపాతీ, పరోటాలపై లేని GST.. ఇడ్లీ, దోశలపై ఎందుకు’

చపాతీ, పరోటాలపై పన్నును 18 నుంచి 0%కు తగ్గించిన జీఎస్టీ కౌన్సిల్ ఇడ్లీ, దోశలను యథావిధిగా 5% పరిధిలోనే ఉంచడం విమర్శలకు దారితీస్తోంది. ఇవి ఎక్కువగా దక్షిణాది వాళ్లే తింటారు. దీంతో ఉత్తరాది అల్పాహారాలపై పన్ను తీసేసి ఇక్కడి వంటకాలపై వివక్ష చూపుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో MLA రామకృష్ణ దీన్ని ప్రస్తావించడాన్ని గుర్తు చేస్తున్నారు.
News September 20, 2025
‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం

AP: పల్నాడు జిల్లా మాచర్లలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెరువు వద్ద చెత్త ఊడ్చారు. వారితో కాసేపు మాట్లాడారు. స్వచ్ఛరథం వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.2కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక బహిరంగ సభలో పాల్గొని మార్గదర్శి-బంగారు కుటుంబాల సభ్యులతో సమావేశం కానున్నారు.
News September 20, 2025
సమయం వచ్చింది.. దేశాభివృద్ధికి ప్రతిభను వాడుదాం!

ట్రంప్ నిర్ణయాల వేళ మన ప్రతిభతో ఇండియాను అభివృద్ధి చేసుకోవాలనే చర్చ మొదలైంది. విదేశాల్లో ఉద్యోగాల కోసం వెతక్కుండా మన దగ్గరే ప్రతిభను ఉపయోగించుకొని దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్టార్టప్‌లు, టెక్నాలజీ, వ్యవసాయం వంటి రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రతి సవాలును అవకాశంగా మలుచుకొని దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలబెట్టే సత్తా మన యువతకు ఉందంటున్నారు.