News May 22, 2024
కంటింజెన్సీ రిస్క్ బఫర్ అంటే?

అత్యవసర నిధుల తరహాలో కేంద్రం కోసం కంటింజెన్సీ రిస్క్ బఫర్ (CRB) పేరుతో ఆర్బీఐ ప్రత్యేక నిధిని కేటాయిస్తుంది. ప్రభుత్వ బాండ్ల విలువలు తగ్గడం, మానిటరీ పాలసీలో మార్పులతో సవాళ్లు ఎదురైన సందర్భాల్లో ఈ నిధులను RBI వినియోగిస్తుంది. ఏటా కొంత పర్సెంట్ చొప్పున నిధులు కేటాయించి మిగిలిన మొత్తాన్ని ఆర్థిక ఏడాది ముగిశాక కేంద్రానికి ఇస్తుంది. ఆర్బీఐకి వచ్చే ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని ఈ CRBకి కేటాయిస్తుంది.
Similar News
News December 17, 2025
ఆదిలాబాద్ జిల్లాలో 54.45 శాతం నమోదు

ఆదిలాబాద్ జిల్లాలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 54.45 శాతం సరాసరి ఓటింగ్ నమోదైందని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. బజార్హత్నూర్లో 53.57%, బోథ్ 47.73%, గుడిహత్నూర్ 58.11%, నేరడిగొండ 50.94%, సోనాల 55.56%, తలమడుగులో 61.19% నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.
News December 17, 2025
50 శాతం మందికి వర్క్‌ఫ్రం హోం

ఢిల్లీలో <<18576427>>కాలుష్యం<<>> పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నింటిలో 50 శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పరిస్థితి మెరుగుపడే వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి.
News December 17, 2025
విమర్శలకు భయపడేది లేదు: చంద్రబాబు

AP: మెడికల్ కాలేజీల అంశంపై విమర్శలకు భయపడేది లేదని కలెక్టర్ల సదస్సులో CM CBN తెలిపారు. PPP పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నా అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయన్నారు. 70% మందికి NTR వైద్యసేవలు అందడంతో పాటు విద్యార్థులకు సీట్లూ పెరుగుతాయని చెప్పారు. గతంలో రూ.500Crతో రుషికొండ ప్యాలెస్‌ను నిర్మించి డబ్బులు వృథా చేశారని, అవి ఉంటే 2 మెడికల్ కాలేజీలు నిర్మించేవాళ్లమని CM వ్యాఖ్యానించారు.


