News July 13, 2024

‘మహిళలకు ఉచిత బస్సు’ ఏది?: షర్మిల

image

AP: మహిళలకు ఉచిత బస్సు అన్న హామీ అమలు ఏమైందంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నెలరోజులు గడిచినా వాగ్దానం నిలబెట్టుకోలేదంటూ ప్రెస్‌మీట్‌లో విమర్శించారు. ‘తెలంగాణలో ప్రభుత్వం వచ్చిన రెండోరోజు, కర్ణాటకలో 3 వారాలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. ఏపీలో చంద్రబాబుకు ఎంత సమయం పడుతుంది? ఆయన సమాధానం కోసం మహిళలు ఎదురుచూస్తున్నారు’ అని పేర్కొన్నారు.

Similar News

News October 17, 2025

ఐపీఎస్ సంజయ్ రిమాండ్ పొడిగింపు

image

AP: ఐపీఎస్ సంజయ్ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈనెల 31 వరకు రిమాండ్ పొడిగించడంతో ఆయనను కాసేపట్లో విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో సంజయ్ నిందితుడిగా ఉన్నారు.

News October 17, 2025

సంస్కరణలతోనే ఉజ్వల భవిష్యత్తు: CBN

image

AP: భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని CM CBN అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. నాటిన కొంతకాలానికి చెట్లు ఫలాలు అందిస్తాయని, అదే మాదిరి సంస్కరణలు కూడా కొన్నిరోజుల తర్వాత ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరుస్తాయని వివరించారు. GST 2.0పై నిర్వహించిన పోటీల్లో గెలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. సంస్కరణల ప్రయోజనాల గురించి వారిని అడిగారు.

News October 17, 2025

కాంగ్రెస్ అభ్యర్థికి AIMIM మద్దతు

image

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు AIMIM చీఫ్ అసదుద్దీన్ మద్దతు తెలిపారు. ఎన్నికల్లో నవీన్ గెలిచి జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాలను కలుపుకుని ముందుకెళ్లాలని సూచించారు. గత పదేళ్లుగా రాష్ట్రంలో పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయన్నారు. అంతకుముందు నవీన్ నామినేషన్ దాఖలు చేశారు.