News December 24, 2024

తెలంగాణలో ఏం జరుగుతోంది?: కేటీఆర్

image

TG: తెలంగాణలో ఏం జరుగుతోందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘కూల్చివేతలు, ఎగవేతలు, కరెంటు కోతలు, చిన్నారుల చావులు, కోడెల అమ్మకాలు, అల్లర్లు, అబద్ధాలు, పగలు, ప్రతీకారాలు, దాడులు, దౌర్జన్యాలు, ధర్నాలు, దీక్షలు, ఢిల్లీ టూర్లు, అప్పులు, తప్పులు, డైవర్షన్‌లు, స్టంట్‌లు, బూతులు, లూటీలు, కేసులు, అరెస్ట్‌లు. ఇవేనా? ఇంకేమైనా ఉంటే చెప్పండి’ అని పేర్కొన్నారు.

Similar News

News January 21, 2026

ఆ హీరోయిన్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్!

image

బాలీవుడ్‌ హీరోయిన్ రిమీ సేన్ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారారు. సినిమా అవకాశాలు తగ్గాక దుబాయ్‌లో సెటిల్ అయ్యారు. ‘ఇక్కడ 95% మంది ప్రవాసులే. రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో క్రమశిక్షణ ఉంటుంది. ఏజెంట్లను ఆర్థిక సలహాదారులతో సమానంగా చూస్తారు. అదే ఇండియాలో 2నెలల బ్రోకరేజీ అడిగితే నేరం అన్నట్లుగా చూస్తారు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హిందీలో ధూమ్, హంగామా, గోల్‌మాల్‌తోపాటు తెలుగులో అందరివాడు మూవీలో ఆమె నటించారు.

News January 21, 2026

FLASH: పెరిగిన వెండి ధర

image

ఇవాళ ఉదయం నుంచి తటస్థంగా ఉన్న వెండి ధర మధ్యాహ్నం పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు పెరిగి రూ.3,45,000కు చేరింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతుండటంతో గోల్డ్, సిల్వర్ రేట్లు ఊహించని స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,61,100, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,48,474గా ఉంది.

News January 21, 2026

పండ్ల తోటల్లో కలుపు నివారణ మార్గాలు

image

పండ్ల తోటల తొలిదశలో అంతర పంటలతో కలుపు తగ్గించవచ్చు. పండ్ల కోత తర్వాత ముందుగా తోటంతా అడ్డంగా, నిలువుగా దున్నాలి. కలుపు మొక్కలు పెరిగితే రోటావేటర్ తోటలోకి వెళ్లడానికి వీలుగా ఏపుగా పెరిగిన కొమ్మలను తీసేసి ఒకసారి తోటంతా శుభ్రం చేస్తే నెలరోజులపాటు కలుపును నివారించవచ్చు. తోటను శుభ్రం చేసిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు 1-1.5 లీటర్ల పెండిమిథాలిన్‌ను 5 కిలోల ఇసుకలో కలిపి తోటంతా సమానంగా వెదజల్లాలి.