News July 14, 2024
జగన్నాథుని భాండాగారంలో ఏమున్నాయంటే?

1978లో ఒడిశా పూరీ జగన్నాథుని రత్న భాండాగారాన్ని చివరిసారిగా తెరిచారు. 70 రోజులు జరిగిన <<13627180>>లెక్కింపులో<<>> 128.38KGల 454 బంగారు ఆభరణాలు, 221.53KGల 293 వెండి ఆభరణాలను గుర్తించారు. లోపలి ట్రెజరీలో 43KGల 367 బంగారు వస్తువులు, 148KGల 231 వెండి వస్తువులను లెక్కించారు. బయటి ట్రెజరీలో 84.74KGల 87 బంగారు ఆభరణాలు, 73.64KGల 62 వెండి వస్తువులు గుర్తించారు. తాజా లెక్కింపు తర్వాత ఆభరణాల విలువను ప్రకటించనున్నారు.
Similar News
News November 20, 2025
పంచాయతీ ఎన్నికలపై కీలక సమీక్ష

TG: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. CS రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర అధికారులతో సమీక్షించారు. స్థానిక ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలని ఆమె ఆదేశించారు. కాగా మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 11, 14, 17న ఎలక్షన్స్ జరుగుతాయని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News November 20, 2025
ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ పూర్తి

TG: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ పూర్తయింది. ఆయన తన నిర్ణయాన్ని త్వరలో ప్రకటించనున్నారు. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 10 మందిలో తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, డా.సంజయ్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, కాలే యాదయ్య విచారణకు హాజరయ్యారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి హాజరుకాలేదు.
News November 20, 2025
బండి సంజయ్పై పేపర్ లీకేజీ కేసు కొట్టివేత

TG: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై దాఖలైన టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసును హైకోర్టు కొట్టేసింది. 2023లో పదో తరగతి హిందీ పేపర్ లీకేజీకి కారణమంటూ కమలాపూర్ PSలో ఆయనపై కేసు నమోదైంది. దీనిపై ఆయన HCని ఆశ్రయించగా సరైన సెక్షన్లు, ఆధారాలు లేవంటూ తాజాగా కేసును క్వాష్ చేసింది. మరోవైపు 2023 ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించారంటూ మాజీ మంత్రి KTR, గోరటి వెంకన్నపై దాఖలైన FIRనూ HC కొట్టివేసింది.


