News April 12, 2024
మల్టిపుల్ సెక్స్ పార్ట్‌నర్స్ ర్యాంకింగ్స్‌లో భారత్ స్థానం ఎంతంటే!
భారత్‌కు చెందినవారు తన జీవిత కాలంలో సగటున ముగ్గురు లైంగిక భాగస్వాముల్ని కలిగి ఉన్నట్లు WPR అధ్యయనంలో తేలింది. 46దేశాల్లో సర్వే చేయగా భారత్ చివరి స్థానంలో నిలిచింది. కాగా సగటున ఓ వ్యక్తి 14.5 మంది లైంగిక భాగస్వాముల్ని కలిగి ఉండటంతో తుర్కియే దేశం తొలి స్థానంలో ఉంది. భారతీయ విలువలు, సంస్కృతే ఈ జాబితాలో మన దేశం అట్టడుగున నిలవడానికి కారణమని.. ఇది మంచి పరిణామమని విశ్లేషకులు చెబుతున్నారు.
Similar News
News November 16, 2024
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మన CMలు
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల CMలు అక్కడ వేర్వేరుగా పర్యటించనున్నారు. చంద్రబాబు ఈ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి వెళ్లి ఎన్డీయే తరఫున ప్రచారం చేయనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం10గంటలకు చంద్రాపూర్ వెళ్లే రేవంత్ నేడు, రేపు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారసభలు, రోడ్ షోలలో పాల్గొననున్నారు. ఏపీ డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ కూడా 16, 17తేదీల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
News November 16, 2024
రేపు, ఎల్లుండి గ్రూప్-3 పరీక్షలకు సర్వం సిద్ధం
TG: వివిధ శాఖల్లో 1,388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి రేపు, ఎల్లుండి పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాలను TGPSC సిద్ధం చేసింది. 5.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. రేపు ఉ.10 నుంచి మ.12.30 వరకు పేపర్-1, మ.3 నుంచి సా.5.30 వరకు పేపర్-2, 18న ఉ.10 నుంచి మ.12.30 వరకు పేపర్-3 ఎగ్జామ్ జరగనుంది. అభ్యర్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని TGPSC సూచించింది.
News November 16, 2024
ఈ విజయం ఎప్పటికీ నాతో ఉంటుంది: సూర్య
దక్షిణాఫ్రికాపై నిన్న సాధించిన టీ20 సిరీస్ విజయం తనతో ఎప్పటికీ నిలిచిపోతుందని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. దక్షిణాఫ్రికా పర్యటనలో సిరీస్ గెలవడం అంత సులువు కాదని గుర్తుచేశారు. ‘సౌతాఫ్రికా పర్యటన ఎప్పుడైనా సవాలే. యువ జట్టుతో ఇక్కడికొచ్చి ఇలా గెలుపొందడం అద్భుతం. ఫలితం గురించి ఆలోచించకుండా ఆడాం’ అని తెలిపారు. భారత్ ఈ ఏడాది ఆడిన 26 టీ20ల్లో 24 మ్యాచుల్లో గెలవడం విశేషం.