News September 19, 2024
లంచ్ సమయానికి భారత్ స్కోరు ఎంతంటే?

బంగ్లాదేశ్తో తొలి టెస్టులో 34 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన భారత్ను యశస్వి, పంత్ ఆదుకున్నారు. లంచ్ విరామం వరకు వికెట్ కోల్పోకుండా నియంత్రణతో ఆడారు. భారత జట్టు 23 ఓవర్లలో 88 పరుగులు చేయగా యశస్వి(37), పంత్(33) క్రీజులో ఉన్నారు.
Similar News
News October 15, 2025
DSSSBలో 1180 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఢిల్లీలో 1180 అసిస్టెంట్ టీచర్ (ప్రైమరీ) పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంటర్, DEd లేదా B.EI.Ed, సీటెట్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.100, ST, SC, మహిళలు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. రాతపరీక్ష ద్వారా ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. * మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 15, 2025
20 మంది మృతి.. పరిహారం ప్రకటించిన ప్రధాని

రాజస్థాన్లో జైసల్మేర్ నుంచి జోధ్పూర్కు వెళ్తున్న బస్సు <<18008110>>దగ్ధమై<<>> 20 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై PM మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరో 16 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.
News October 15, 2025
ప్రభుత్వానికి ఆస్తి రాసిచ్చి.. కొడుకుకు తండ్రి గుణపాఠం!

TG: తన బాగోగులు చూసుకోని కొడుకుకు సరైన గుణపాఠం చెప్పాడా తండ్రి. హన్మకొండ(D) ఎల్కతుర్తి మాజీ MPP శ్యాంసుందర్ రూ.3Cr విలువైన మూడెకరాల భూమిని ప్రభుత్వానికి రాసిచ్చారు. ప్రభుత్వ స్కూల్/ కాలేజీ కట్టి తన భార్య పేరు పెట్టాలని కోరారు. భార్య మరణించినప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న ఆయనను కొడుకు రంజిత్ రెడ్డి చేరదీయలేదు. పైగా కొంత ఆస్తి తన పేరిట రాయించుకొని దాడి చేశారు. దీంతో శ్యాంసుందర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.