News December 8, 2024
భారత్ టార్గెట్ ఎంతంటే?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733648298253_1226-normal-WIFI.webp)
అండర్-19 ఆసియాకప్ ఫైనల్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ను 198 పరుగులకే ఆలౌట్ చేశారు. ఆ జట్టులో రిజాన్(47), జేమ్స్(40), ఫైజల్(39) ఫర్వాలేదనిపించారు. భారత్ బౌలర్లలో యుధజిత్, చేతన్, హర్దిక్ రాజ్ తలో 2, కిరణ్, కార్తికేయ, ఆయుశ్ చెరో వికెట్ తీశారు. భారత్ టార్గెట్ 199.
Similar News
News February 5, 2025
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉత్తమ్ వార్నింగ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737736350357_367-normal-WIFI.webp)
TG: బీసీ కులగణనపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కోసమే రేపు సీఎం రేవంత్‌తో సమావేశం కానున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజల అపోహలు తొలగించడమే తమ లక్ష్యమని చెప్పారు. దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సమగ్ర కులగణనపై అనవసర రాద్ధాంతం చేయొద్దన్నారు. ఎవరైనా పార్టీ లైన్ దాటి మాట్లాడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 5, 2025
‘హరిహర వీరమల్లు’ ఆఖరి షెడ్యూల్ ప్రారంభం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738740849160_1045-normal-WIFI.webp)
పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘హరిహర వీరమల్లు’ పార్ట్-1 షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈరోజు నుంచి మూవీ ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. పవన్ త్వరలోనే షూటింగ్లో చేరనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరు వరకూ జరిగే ఈ షెడ్యూల్ పూర్తైతే మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ కానున్నట్లు తెలుస్తోంది. జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్గా, బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
News February 5, 2025
గూగుల్ ప్రతినిధులతో లోకేశ్ భేటీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738741377514_81-normal-WIFI.webp)
AP:గూగుల్ క్లౌడ్ MD బిక్రమ్ సింగ్, డైరెక్టర్ ఆశిష్‌తో మంత్రి లోకేశ్ ఢిల్లీలో భేటీ అయ్యారు. విశాఖలో గూగుల్ క్లౌడ్ ఏర్పాటు చేసే డేటా సిటీపై వారితో చర్చించారు. త్వరితగతిన అనుమతులు, భూకేటాయింపులు చేస్తామని లోకేశ్ వారితో చెప్పారు. ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు చురుగ్గా పనిచేస్తోందని, కంపెనీ కూడా ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు APకి గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని లోకేశ్ అభిప్రాయపడ్డారు.