News May 5, 2024

ప్రజల భూములపై జగన్ పెత్తనం ఏంటీ?: చంద్రబాబు

image

AP: సీఎం జగన్ తెచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదని.. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం అని టీడీపీ చీఫ్ చంద్రబాబు విమర్శించారు. ప్రజల భూములపై జగన్ పెత్తనం ఏంటనీ ఆయన ప్రశ్నించారు. ‘కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాం. రైతుల ఫొటోలతోనే కొత్త పాస్‌బుక్‌లు ఇస్తాం. వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయి. ఈ ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలి’ అని ఆయన కోరారు.

Similar News

News April 1, 2026

ఉమెన్స్ క్రికెట్‌లో సంచలనం.. భారత రికార్డు బ్రేక్

image

మహిళల క్రికెట్‌లో సంచలనం నమోదైంది. అత్యధిక పరుగులను ఛేదించిన జట్టుగా టీమ్ఇండియా(341) పేరిట ఉన్న రికార్డును న్యూజిలాండ్ బద్దలుకొట్టింది. NZతో జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా 346 పరుగులు చేసింది. ఛేదనలో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శన చేసింది. 49.4 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. అమెలియా కేర్ 139 బంతుల్లోనే 179* పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. ఇసబెల్లా 68 పరుగులతో రాణించారు.

News April 1, 2026

TNలో అల్లర్లకు BJP కుట్ర: స్టాలిన్

image

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ BJPపై CM స్టాలిన్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు BJP కుట్ర పన్నిందని, దాన్ని అధికార DMK భగ్నం చేసిందని చెప్పారు. BJP పాలిత రాష్ట్రాలైన UP, మణిపుర్‌లో కొనసాగుతున్న మూక దాడులు, మత ఘర్షణలు TNలో లేవని ఎద్దేవా చేశారు. DMK ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన మహిళలు తమకు నచ్చిన గృహోపకరణాలు కొనుగోలు చేసేందుకు రూ.8వేల కూపన్ ఇస్తామని హామీ ఇచ్చారు.

News April 1, 2026

వాణిజ్య పంటలు సాగుచేస్తే రూ.10,000!

image

TG: వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగుచేసే రైతులకు ఎకరాకు ₹10,000 ప్రోత్సాహకం ఇవ్వాలని GOVT భావిస్తోంది. పప్పుధాన్యాలు, మార్కెట్లో డిమాండ్ ఇతర వాణిజ్య పంటల సాగుకు మారే రైతులకు దీన్ని అందించనున్నారు. దీనిపై CM రేవంత్ అధికారులతో చర్చిస్తున్నారు. ధాన్యం సేకరణకు ప్రభుత్వం ఎకరాకు ₹20,000 వెచ్చిస్తోంది. పైగా నిల్వ చేయడం సవాలుగా మారుతోంది. పంజాబ్‌లో రైతులకు ₹17,000 ప్రోత్సాహకం ఇచ్చే స్కీమ్ అమల్లో ఉంది.