News October 15, 2024

కలికితురాయి అంటే?

image

కీర్తికిరీటంలో మరో కలికితురాయి అంటూ వార్తల్లో వింటుంటాం. అయితే, చాలా మందికి దీని అర్థం తెలియదు. ‘కలికితురాయి’ అంటే
కొంగ తల ఈకలతో చేసిన శిరోభూషణము అని అర్థం. వివరంగా చెప్పాలంటే.. కలికి అంటే మనోహరమైన, తురాయి అంటే పక్షి ఈక లేదా పువ్వుతో తయారుచేసిన మకుటాలంకారం. ఎవరైనా ఏదైనా అవార్డును, ఘనకార్యాన్ని సాధించినప్పుడు ఆ వ్యక్తి “కీర్తి కిరీటంపై కలికితురాయి ” అనే నానుడిని వాడతారు.

Similar News

News November 5, 2025

న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్‌దానీ

image

అమెరికా ఆర్థిక రాజధాని అయిన న్యూయార్క్ నగర మేయర్‌గా జోహ్రాన్ మమ్‌దానీ (34) ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి ముస్లిం, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ శతాబ్దంలో అత్యంత పిన్న వయసులో న్యూయార్క్ మేయర్ అయిన ఘనత కూడా ఈయనదే. డెమొక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేసిన జోహ్రాన్ స్వతంత్ర అభ్యర్థి ఆండ్రూపై గెలిచారు. మమ్‌దానీ తల్లిదండ్రులు ఇండియాలో జన్మించారు.

News November 5, 2025

హన్స్‌రాజ్ కాలేజీలో ఉద్యోగాలు

image

ఢిల్లీలోని హన్స్‌రాజ్ కాలేజీ 24 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబర్ 21లోపు అప్లై చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా, మిగతా పోస్టులకు 32ఏళ్లు. వెబ్‌సైట్: https://hansrajcollege.ac.in/

News November 5, 2025

నాకు బతికే అర్హత లేదు అంటూ హీలియం గ్యాస్ పీల్చి..

image

AP: ఇటీవల CA పరీక్షల్లో ఫెయిలైన విశాఖకు చెందిన అఖిల్ వెంకట కృష్ణ (29) అనే విద్యార్థి తల్లిదండ్రులకు భావోద్వేగపూరిత లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘మిమ్మల్ని మోసం చేశా. ఇక నాకు బతికే అర్హత లేదు, క్షమించండి’ అంటూ సూసైడ్ నోట్ రాశాడు. నిన్న రాత్రి తన ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఇతడు గుంటూరులో సీఏ కోచింగ్ తీసుకున్నాడు.