News November 12, 2024

అవినీతి జరిగితే మోదీ ఏం చేస్తున్నారు?: KTR

image

TG: కేంద్ర ప్రభుత్వ స్కీంలో అవినీతి జరిగితే ప్రధాని మోదీ ఏం చేస్తున్నారని KTR ప్రశ్నించారు. రూ.8,888కోట్ల విలువైన టెండర్లపై విచారణ జరపాలని కోరారు. అడ్రస్, అర్హత లేని కంపెనీలకు టెండర్లు ఇచ్చారని, వాటి వివరాలను ఆన్‌లైన్‌లో కూడా పెట్టలేదన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారిందని బీజేపీ అంటోందని, దీనిపై ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. రేవంత్, పొంగులేటిల భరతం పట్టడం ఖాయమని KTR హెచ్చరించారు.

Similar News

News September 3, 2025

అదే నా బిగ్గెస్ట్ డ్రీమ్: రింకూ సింగ్

image

భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటమే తన బిగ్గెస్ట్ డ్రీమ్ అని రింకూ సింగ్ వెల్లడించారు. ‘అవకాశం వస్తే అన్ని ఫార్మాట్లలో రాణించగలననే నమ్మకం ఉంది. టీ20 స్పెషలిస్ట్ ట్యాగ్ నాకు ఇష్టం ఉండదు. ఒక్క ఫార్మాట్‌కే పరిమితం కావాలనుకోవట్లేదు. నేను సిక్సులు కొడితే ఫ్యాన్స్ ఇష్టపడతారని తెలుసు. కానీ రంజీల్లో కూడా నా సగటు (55) బాగుంది. రెడ్ బాల్ క్రికెట్ ఆడటాన్ని ఆస్వాదిస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

News September 3, 2025

ఇందిరమ్మ ఇళ్లకు తక్కువ ధరకే సిమెంట్, స్టీల్!

image

TG: ఇందిరమ్మ ఇళ్లకు తక్కువ ధరకే సిమెంట్, స్టీల్ అందించాలని కంపెనీ యాజమాన్యాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కోరారు. కంపెనీలన్నీ ఒకే ధరకు సరఫరా చేయాలని సూచించారు. దీనిపై సంస్థల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో త్వరలో సమావేశమై ధరలను ఫైనల్ చేస్తామని తెలిపారు. ప్రభుత్వం మానవీయ కోణంలో చేపట్టిన ఈ పథకానికి సహకారం అందించడం తమ అదృష్టమని మంత్రులతో అన్నారు.

News September 3, 2025

నేను చాలా యాక్టివ్‌గా ఉన్నా: ట్రంప్

image

సోషల్ మీడియాలో తనపై వస్తున్న రూమర్స్ వింటున్నానని, అవన్నీ అవాస్తవాలేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొట్టిపారేశారు. గత వారం రోజులుగా తాను గోల్ఫ్ ఆడుతూ చాలా యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడించారు. వైట్ హౌస్‌లో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కాగా కొద్ది రోజులుగా ట్రంప్ బహిరంగంగా కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో ‘<<17563031>>ట్రంప్ ఈజ్ డెడ్<<>>’ అంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.