News April 27, 2024

‘నవరత్న’ అంటే ఏంటి? – 2/2

image

ఇక మినీరత్న స్థాయిని దాటితే సంస్థలకు నవరత్న హోదా అందుతుంది. ఈ హోదా అందుకుంటే సంస్థలు కేంద్రం అనుమతి అవసరం లేకుండా రూ.1000కోట్ల వరకు పెట్టుబడులను పెట్టొచ్చు/సమీకరించొచ్చు. ప్రస్తుతం 17 నవరత్న కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థల నికర విలువ రూ.15వేల కోట్లకు చేరి, మూడేళ్లలో వార్షిక లాభం రూ.5వేల కోట్లు నమోదు చేస్తే సంస్థలు మహారత్న హోదా అందుకుంటాయి. కాగా ప్రస్తుతం దేశంలో 13 మహారత్న కంపెనీలు ఉన్నాయి.

Similar News

News December 13, 2025

వంటింటి చిట్కాలు

image

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.

News December 13, 2025

అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

image

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్‌లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.

News December 13, 2025

NIT ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు

image

<>నేషనల్ <<>>ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏపీ 2 ల్యాబ్ ట్రైనీ పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనుంది. డిప్లొమా(సివిల్ ఇంజినీరింగ్), బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు డిసెంబర్ 18న ఉదయం 9.30గంటలకు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. ఎంపికైనవారికి నెలకు జీతం రూ.18,000-రూ.22,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://nitandhra.ac.in/