News July 12, 2024
ఆర్మీలో ‘నెక్స్ట్ ఆఫ్ కిన్’ అంటే?

కెప్టెన్ అన్షుమాన్ భార్య స్మృతి, పేరెంట్స్ మధ్య <<13611952>>వివాదంతో<<>> ఆర్మీలో ఉండే ‘నెక్స్ట్ ఆఫ్ కిన్(NOK)’ రూల్‌పై చర్చ జరుగుతోంది. వ్యక్తి ఆర్మీలో చేరినప్పుడు అతడి పేరెంట్స్‌ను NOKగా రికార్డుల్లో చేరుస్తారు. అతడికి వివాహమైనప్పుడు పేరెంట్స్ ప్లేస్‌లో భార్య పేరు చేరుతుంది. జవాన్ వీరమరణం పొందితే వచ్చే పరిహారం భార్యకే ఇస్తారు. ఆ నిబంధనను తొలగించాలని ఇప్పుడు అన్షుమాన్ తల్లిదండ్రులు కోరుతున్నారు.
Similar News
News April 6, 2026
ఒక్కరోజే 51 లక్షల సిలిండర్ల విక్రయం: కేంద్రం

పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మార్చి 23 నుంచి ఇప్పటివరకు 5 కేజీల సిలిండర్లు 6.6 లక్షలు అమ్ముడైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎలాంటి కొరత లేదని, ఏప్రిల్ 4న ఒక్క రోజే 51 లక్షల గృహ వినియోగ సిలిండర్లు డెలివరీ అయ్యాయని తెలిపింది. మార్చి నుంచి ఇప్పటివరకు అక్రమంగా నిల్వ చేసిన 50వేలకు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
News April 6, 2026
చైనాను మించిన క్రీడా సదుపాయాలు HYDలో ఉండాలి: CM

TG: ఒలింపిక్స్ నిర్వహించేలా, చైనాను మించిన క్రీడా సదుపాయాలు HYDలో ఉండాలని రాష్ట్ర స్పోర్ట్స్ హబ్ ప్రతినిధులకు CM రేవంత్ సూచించారు. గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధిపై ఆయన సమీక్షించారు. ‘క్రీడారంగంలో HYDను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలి. జూన్ 2న స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తాం. ఆటగాళ్లు నేరుగా స్టేడియానికి చేరుకునేలా హెలిప్యాడ్‌తో పాటు ప్రపంచ స్థాయి సదుపాయాలు ఏర్పాటు చేయాలి’ అని ఆదేశించారు.
News April 6, 2026
ఏప్రిల్ 6: చరిత్రలో ఈరోజు

1886: HYD చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జననం
1896: ఏథెన్స్‌లో ఆధునిక ఒలింపిక్ క్రీడలు ప్రారంభం
1928: DNA నిర్మాణాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ జననం
1938: కీటక శాస్త్రవేత్త, పద్మశ్రీ&పద్మభూషణ్ అవార్డుల గ్రహీత వినోద్ ప్రకాశ్ శర్మ జననం
1956: భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ జననం
2011: సినీ నటి సుజాత మరణం (ఫొటోలో)


