News September 28, 2024

ఎన్టీఆర్ ‘దేవర’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

image

భారీ అంచనాలతో విడుదలైన జూ.ఎన్టీఆర్ ‘దేవర’ తొలిరోజే అదిరిపోయే కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్‌గా నిన్న రూ.140 కోట్లు వసూలు చేసినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. AP, TGలోనే రూ.60-70 కోట్లు వచ్చినట్లు సమాచారం. హిందీలో రూ.7 కోట్లు వసూలు చేసిందని టాక్. మిగతా భాషలతో పాటు ఓవర్సీస్‌లో కలుపుకొని రూ.140 కోట్లు వచ్చాయని అంచనా. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Similar News

News January 10, 2026

తగ్గని రష్యా.. ఉక్రెయిన్‌పై మరోసారి మిసైళ్ల దాడి!

image

అమెరికా దూకుడు, పశ్చిమ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి దాడులు చేసింది. వందలాది డ్రోన్లు, డజన్లకొద్దీ మిసైళ్లతో కీవ్‌పై విరుచుకుపడింది. నలుగురు చనిపోయారని, 25 మందికి పైగా గాయపడ్డారని ఉక్రెయిన్ తెలిపింది. యుద్ధం మొదలయ్యాక రష్యా శక్తిమంతమైన హైపర్‌సోనిక్ మిసైల్‌ను ఉపయోగించడం ఇది రెండోసారి అని తెలుస్తోంది. దీంతో పుతిన్ శాంతిని కోరుకోవడం లేదని యూరోపియన్ నేతలు మండిపడ్డారు.

News January 10, 2026

అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి

image

అమెరికాలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. మిసిసిపీలోని క్లే కౌంటీలో దుండగుడు జరిపిన ఫైరింగ్‌లో ఆరుగురు చనిపోయారు. మూడు వేర్వేరు ప్రాంతాల్లో అతడు దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కాల్పులు జరిపింది ఎవరు, ఎందుకు చేశాడనే దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 10, 2026

బంగ్లా-పాక్ మధ్య విమానాలు.. కేంద్రం పర్మిషన్ ఇస్తుందా?

image

పాక్‌కు ఈ నెల 29 నుంచి బంగ్లాదేశ్ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇండియన్ ఎయిర్ స్పేస్ నుంచే అవి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో బంగ్లా విమానాలకు కేంద్రం పర్మిషన్ ఇస్తుందా అనేది కీలకంగా మారింది. పాక్ విమానాలు మన గగనతలం నుంచి వెళ్లడంపై నిషేధం ఉంది. ఈ క్రమంలో ఒకవేళ కేంద్రం ఒప్పుకోకపోతే 2,300KM వెళ్లాల్సిన విమానాలు 5,800KM మేర చుట్టేసుకుని పోవాల్సి ఉంటుంది. 3 గంటల జర్నీ కాస్తా 8 గంటలకు పెరగనుంది.