News November 4, 2024

పంచనామా అంటే ఏమిటి? ఆ పేరెలా వచ్చింది?

image

నేరవార్తల్లో పంచనామా పదం చదివే ఉంటాం. ఘటనాస్థలికి అధికారి వెళ్లి గమనించినవి నమోదు చేయడమే పంచనామా. Ex: అనుమానాస్పద మృతి కేసులో మృతదేహ స్థితి, గది, అక్కడి వస్తువులు సహా చూసిన వివరాలన్నీ రాసుకుంటారు. దర్యాప్తులో ఇవి క్లూ/సాక్ష్యంగా ఉపయోగపడతాయి. గతంలో వివాద పరిష్కారాలకు ఊరి పెద్ద సహా ప్రముఖులు కొందరు కలిసి ఐదుగురు బృందంగా ఉండేవారు. ఏదైనా తగాదాపై వారి ఎదుట పత్రం రాసేవారు కావడంతో పంచనామా పేరు వచ్చింది.

Similar News

News November 27, 2025

2030లో బంగారం విలువ ఎంత ఉండనుంది?

image

గత 25 ఏళ్లలో పసిడి ధరలు గణనీయంగా పెరిగాయి. 2000లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర రూ.4,400 కాగా ఇప్పుడు అది దాదాపు రూ.1,25,000కి చేరింది. సుమారు 14% కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటుతో స్థిరంగా పెరుగుతోంది. ప్రస్తుతం రూ.5 లక్షల విలువైన బంగారం కొనుగోలు చేస్తే 2030 నాటికి రూ.10 లక్షలు దాటే అవకాశం ఉందని వాణిజ్య విశ్లేషకులు అంటున్నారు. అయితే పసిడి ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటాయి.

News November 27, 2025

ఇలా పడుకుంటే మొటిమల ముప్పు

image

సాధారణంగా మన చర్మం విడుదల చేసే నూనెలు, చెమట, బ్యాక్టీరియాతో పాటు మృతకణాలూ దిండు పైకి చేరతాయి. దిండు కవర్లను తరచూ మార్చకపోతే మొటిమల ముప్పు ఉంటుంది. అలాగే మేకప్ తొలగించకపోవడం, బోర్లా పడుకోవడం, గదిలో ఉష్ణోగ్రత, హ్యుమిడిటీ ఎక్కువగా ఉండటం వల్ల కూడా చర్మం ఎక్కువ సీబమ్‌ను ఉత్పత్తి చేసి మొటిమలకు కారణమవుతాయి. కాబట్టి బెడ్‌రూంను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

News November 27, 2025

మరో తుఫాన్.. ‘దిట్వా’గా నామకరణం

image

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. ఇది బలపడి తుఫానుగా మారితే యెమెన్ సూచించిన ‘దిట్వా’ అని నామకరణం చేస్తారు. దిట్వా అనేది యెమెన్ సోకోత్రా ద్వీపంలోని ఫేమస్ సరస్సు పేరు. సెన్యార్ ఏర్పడిన సమయంలోనే ఈ అల్పపీడనం కూడా ఏర్పడిందని IMD తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఏపీ వైపు కదులుతూ బలపడే ఛాన్స్ ఉందని చెప్పింది.