News June 12, 2024
పవన్ కళ్యాణ్‌కు ఏ శాఖ?

AP రాజకీయ వర్గాల్లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్‌కు ఏ శాఖ వస్తుందనే చర్చే నడుస్తోంది. ఇప్పటికే ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఆయనకు డిప్యూటీ CM ఖరారైనట్లు తెలుస్తోంది. మరి దాంతో పాటు హోంమంత్రి ఇస్తారా? వేరే ఏదైనా శాఖ అప్పగిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. అటు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ CM అని పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ జనసేనానికి ఏ శాఖ సూట్ అవుతుందని మీరు భావిస్తున్నారు?
Similar News
News December 1, 2025
తెలంగాణ అప్డేట్స్

*రైతు భరోసా ఇవ్వకుండా కౌలు రైతులను ప్రభుత్వం మోసగించిందని BRS నేత హరీశ్ విమర్శించారు.
* టెట్ దరఖాస్తులలో వివరాల సవరణ గడువు నేటితో ముగియనుంది. పేరు, ఆధార్, ఫోన్ నంబర్, అర్హతలు, సెంటర్లు మార్పు చేసుకోవచ్చు.
* కరెంటు సహా ఇతర బిల్లుల ఆధారంగా ‘ఆల్టర్నేటివ్ క్రెడిట్ స్కోరు’ ఇచ్చేందుకు ‘తెలంగాణ ఇన్ఫర్మేషన్ బ్యూరో (TIB)’ను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ స్కోరుతో బ్యాంకులు SHG సభ్యులకు లోన్లు ఇస్తాయి.
News December 1, 2025
హైదరాబాద్‌లో 45 పోస్టులకు నోటిఫికేషన్

HYD సనత్‌నగర్‌లోని <
News December 1, 2025
మాయదారి మహమ్మారికి ఆరేళ్లు..!

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ‘కరోనా’ మహమ్మారిని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. చైనా వుహాన్‌లో తొలి కరోనా కేసు నమోదై నేటికి ఆరేళ్లు. 2019లో మొదలైన ఈ మహమ్మారి అతి తక్కువ కాలంలోనే ప్రపంచాన్ని చుట్టుముట్టింది. 70లక్షల మంది ప్రాణాలను హరించి, కోట్లాది మందిని రోడ్డున పడేసింది. భారీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న మానవాళి.. టీకాలు, ఆరోగ్య నియమాలతో పోరాడి గెలిచింది. కరోనా మీ జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చింది?


