News November 11, 2024

భారత జట్టుతో పాంటింగ్‌కు ఏం పని?: గంభీర్

image

రోహిత్, కోహ్లీ ప్రదర్శన తగ్గిందనే రికీ పాంటింగ్ <<14572527>>వ్యాఖ్యలకు<<>> భారత జట్టు కోచ్ గంభీర్ కౌంటర్ ఇచ్చారు. ఆయనకు భారత జట్టుతో ఏం పని? ఆస్ట్రేలియా జట్టు గురించి ఆలోచించుకోవాలని హితవు పలికారు. రోహిత్, కోహ్లీ ఆటతీరుపై తమకు ఎలాంటి ఆందోళనలు లేవని చెప్పారు. వారిప్పటికే చాలా సాధించారని, భవిష్యత్తులోనూ ఇదే కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గత సిరీస్ ఓటమితో వారిలో ఇంకా కసి పెరిగిందని తెలిపారు.

Similar News

News July 7, 2025

రైల్వే స్టేషన్లో మహిళకు ప్రసవం.. ఆర్మీ వైద్యుడిపై ప్రశంసలు

image

UPలోని ఝాన్సీ రైల్వే స్టేషన్లో ఓ నిండు చూలాలికి ఆర్మీ డాక్టర్ మేజర్ రోహిత్ పురుడు పోసి మానవత్వం చాటారు. పన్వేల్ నుంచి గోరఖ్‌పూర్ వెళ్తున్న రైలులో గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. అదే మార్గంలో HYD వెళ్లే రైలు కోసం వేచి ఉన్న రోహిత్ విషయం తెలియగా రైల్వే సిబ్బంది సహకారంతో ఆమెకు సురక్షితంగా డెలివరీ చేశారు. అనంతరం తల్లి, బిడ్డను ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆర్మీ వైద్యుడిని అందరూ ప్రశంసిస్తున్నారు.

News July 7, 2025

గొంతుకోసి చిన్నారి హత్య.. చిన్నమ్మే హంతకురాలు?

image

TG: జగిత్యాల కోరుట్లలో ఐదేళ్ల చిన్నారి హితీక్ష హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. కుటుంబ తగాదాలతో హితీక్షను చిన్నమ్మే చంపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శనివారం పిల్లలతో ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారి బాత్రూమ్‌లో శవమై తేలింది. నిన్న చిన్నారి అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబసభ్యులు, స్థానికులు హితీక్షకు కన్నీటి వీడ్కోలు పలికారు.

News July 7, 2025

ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరారు. రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్‌ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు, RRRకు అనుమతులు, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు నిధులు కోరనున్నారు.