News December 26, 2024
క్రిస్మస్‌కు పోప్ ఫ్రాన్సిస్ సందేశమిదే

క్రిస్మస్ సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచానికి తన సందేశాన్ని అందించారు. ప్రజలు విద్వేషాలకు వ్యతిరేకంగా గొంతెత్తాలని, ధైర్యాన్ని పుంజుకోవాలని ఆయన కోరారు. ‘రేపటిపై ఆశతో జీవించాలని కోరుతున్నాను. ఉక్రెయిన్, పశ్చిమాసియా, గాజా, లెబనాన్, సిరియా వంటి ప్రాంతాలన్నింటిలోనూ ఆయుధాలను పక్కన పెట్టండి. దయచేసి శాంతిని స్వీకరించండి. ఎంతోమంది పిల్లలు, వృద్ధులు ఆకలితో అలమటిస్తున్నారు’ అని సందేశాన్నిచ్చారు.
Similar News
News January 30, 2026
కూపంలోకి కంటోన్మెంట్..? విలీనంపై బీజేపీ నిప్పులు

అప్పుల ఊబిలో కూరుకుపోయిన GHMCలో క్రమశిక్షణ గల కంటోన్మెంట్‌ను కలపడమంటే ఆత్మహత్యాసదృశ్యమేనని BJP నాయకులు మండిపడుతున్నారు. “సొంత స్టాఫ్‌కు జీతాలివ్వలేని, ఆస్తులన్నీ తాకట్టు పెట్టిన GHMCతో మాకేం పని?” అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మేయర్‌ను పప్పెట్‌గా మార్చి కౌన్సిల్ భేటీలే నిర్వహించని అస్తవ్యస్త వ్యవస్థలోకి కంటోన్మెంట్‌ను నెట్టొద్దని BJP నాయకత్వం డిమాండ్ చేస్తోంది. దీనిపై హైదరాబాదీ కామెంట్?
News January 30, 2026
ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

*మేడారం జాతర.. గద్దెపైకి సమ్మక్క
*రసాయనాలతో లడ్డూ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు: పవన్
*రాజకీయ స్వార్థానికి లడ్డూను వాడుకోవడం దురదృష్టకరం: గుడివాడ అమర్నాథ్
*ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు విచారణకు రావాలని KCRకు సిట్ నోటీసులు
*రేపు విచారణకు రాలేనన్న కేసీఆర్.. అంగీకరించిన సిట్
*మేడిగడ్డ బ్యారేజీని అత్యంత ప్రమాదకర కేటగిరీలో చేర్చిన కేంద్రం
*WPL: ఫైనల్‌కు దూసుకెళ్లిన RCB
News January 30, 2026
రాష్ట్రానికి రూ.128.43 కోట్ల NHM నిధులు

AP: జాతీయ ఆరోగ్య మిషన్ చివరి విడత కింద ఆయా జిల్లాలకు ప్రభుత్వం రూ.128.43 కోట్లను విడుదల చేసింది. FEB 20లోగా వీటిని ఖర్చు చేయాలని ఆదేశించింది. జిల్లాల వారీగా గుంటూరుకు రూ.20.61 కోట్లు, నెల్లూరుకు రూ.8.60 కోట్లు, కృష్ణాకు రూ.6.21 కోట్లు ఇచ్చారు. మిగిలిన జిల్లాలకు రూ.5.20 కోట్ల నుంచి రూ.2 కోట్ల చొప్పున విడుదల చేసినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు.


