News October 16, 2024

ఏంటీ ‘రాడార్ స్టేషన్’?

image

TG: వికారాబాద్ అడవుల్లో నిన్న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ శంకుస్థాపన చేసిన రాడార్ స్టేషన్‌ పూర్తి పేరు ‘వెరీ లో ఫ్రీక్వెన్సీ(VLF) రాడార్ కమ్యూనికేషన్ స్టేషన్’. ఇండియన్ నేవీకి సంబంధించిన ఓడలు, జలాంతర్గాముల్లోని సిబ్బందితో మాట్లాడటంతో పాటు ఇతర రేడియో కమ్యూనికేషన్‌కు దీన్ని ఉపయోగిస్తారు. ఇది 3 KHz నుంచి 30 KHz రేంజ్‌లో తరంగాలను ప్రసారం చేస్తుంది. ఈ సిగ్నల్ నీటి లోపల కూడా 40మీ. వరకూ వెళ్లగలదు.

Similar News

News November 18, 2025

ఉలిక్కిపడిన రాష్ట్రం

image

AP: కొన్నేళ్లుగా మావోయిస్టుల ప్రభావం లేకుండా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం ఇవాళ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత హిడ్మా హతమవడం, విజయవాడ, కాకినాడలో పెద్ద సంఖ్యలో మావోలను అరెస్టు చేయడం కలకలం రేపింది. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పెనమలూరులో ఓ బిల్డింగ్‌ను అద్దెకు తీసుకుని 10 రోజులుగా ఉంటున్నా బయటికి పొక్కకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

‘ఆపరేషన్ కగార్’ దెబ్బ.. ఏపీకి వచ్చి హతమయ్యాడు

image

AP: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో హిడ్మా హతమవడంతో మావోలకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఇటీవల కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్‌గఢ్‌లో మావోలపై దూకుడు ప్రదర్శిస్తోంది. కర్రెగుట్టల నుంచి అబూజ్‌మడ్ పర్వతాలు, నేషనల్ పార్కులో జల్లెడ పట్టింది. దీంతో అనేక మంది మావోలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే హిడ్మా తన దళంతో కలిసి మారేడుమిల్లి మీదుగా ఆంధ్రాలోకి ప్రవేశించి ఇవాళ పోలీసుల కాల్పుల్లో మరణించాడు.