News November 20, 2024
‘పుష్ప2’కు రష్మిక రెమ్యునరేషన్ ఎంతంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న ‘పుష్ప2’ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో నటించినందుకుగానూ ఆమె రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా రష్మిక ఈ చిత్రంలో ‘శ్రీవల్లి’ పాత్రలో నటిస్తున్నారు. డిసెంబర్ 5న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Similar News
News November 21, 2025
‘సెన్యార్’ తుఫాన్.. ఏపీకి వర్ష సూచన

ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఏర్పడనున్న అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీనికి ‘సెన్యార్’గా పేరు పెట్టారు. ఈ తుఫాను ప్రభావంతో ఈ నెల 26 నుంచి 29 వరకు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. ప్రకాశం, NLR, CTR, TPT, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
News November 21, 2025
‘సెన్యార్’ తుఫాన్ – రైతులకు సూచనలు

‘సెన్యార్’ తుఫాన్ వల్ల ఈ నెల 26 నుంచి 29 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తరుణంలో రైతులు ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి తూకం వేసిన వాటిని వెంటనే రైస్ మిల్లులకు తరలించడం మంచిది. ఆరబోసేందుకు ఉన్న ధాన్యాన్ని కుప్పలుగా చేసి టార్పాలిన్ కవర్లతో కప్పి ఉంచితే వర్షానికి తడవకుండా ఉంటుంది.
News November 21, 2025
ఎన్కౌంటర్లపై మావోయిస్టుల లేఖ

వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లపై మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది. అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. మారేడుమిల్లి ఎన్కౌంటర్ పేరుతో కట్టుకథలు అల్లారని ఆరోపించింది. చికిత్స కోసం వచ్చిన <<18318593>>HIDMA<<>>ను ఎన్కౌంటర్ చేశారని మండిపడింది. నిరాయుధులుగా ఉన్నవారిని హత్య చేశారంది. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే హిడ్మాను పట్టుకున్నారని తెలిపింది. ఈనెల 23న దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని పిలుపునిచ్చింది.


